మోడలింగ్ నుంచి సినిమాల్లో అడుగుపెట్టిన నటి మాళవిక మోహనన్(Malavika Mohanan). సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. దుల్కర్ సల్మాన్(Dulqer Salman) హీరోగా వచ్చిన పట్టంబోల అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మాళవిక మోహనన్.

Malavika Mohanan
మోడలింగ్ నుంచి సినిమాల్లో అడుగుపెట్టిన నటి మాళవిక మోహనన్(Malavika Mohanan). సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. దుల్కర్ సల్మాన్(Dulqer Salman) హీరోగా వచ్చిన పట్టంబోల అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు మాళవిక మోహనన్. 2013లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటించిన సూపర్‌హిట్ సినిమా పేట ద్వారా తమిళ సినిమారంగంలో అడుగుపెట్టింది. అక్కడ కూడా మొదటి చిత్రంలోనే తన నటనతో సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత దళపతి విజయ్(Thalapathy Vijay) సరసన మాస్టర్ అనే చిత్రంలోనూ, ధనుష్‌తో(Danush) కలిసి మారన్(Maaran) చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తంగలాన్‌లో విక్రమ్(Vikram) సరసన నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
తంగలాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ భిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నారు. హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మధ్య సినీ రంగంలో తను ప్రవేశించి దశాబ్దం పూర్తయ్యందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇకపై నటనకు స్కోప్ ఉన్న సినిమాల్లోనే నటించాలని డిసైడయ్యింది. ప్రాముఖ్యత లేని పాత్రలను అంగీకరించకూడదని నిర్ణయించుకుంది. అది 500 కోట్ల రూపాయలు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రం అయినా సరే.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అందులో నటించబోనని స్పష్టం చేసింది. అలాంటి చిత్రాలు బ్రహ్మండమైన విజయాన్ని సాధించినా తన పాత్రకు గుర్తింపు ఉండదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నటి మాళవిక మోహనన్ తెలిపారు.
