ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళీ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara), ప్రియాంక మోహన్‌(Priyanka Mohan), సంయుక్త మీనన్‌(Samyuktha Menon), నిత్యా మీనన్‌(Nithya Menon) వంటి మలయాళం భామలు పలు భాషల్లో నటిస్తున్నారు. తాజాగా నటి మాళవిక మోహనన్‌(Malavika Mohanan) హీరోయిన్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీనియర్‌ మలయాళ ఛాయగ్రాహకుడు మోహనన్‌ వారసురాలే మాళివిక.

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళీ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara), ప్రియాంక మోహన్‌(Priyanka Mohan), సంయుక్త మీనన్‌(Samyuktha Menon), నిత్యా మీనన్‌(Nithya Menon) వంటి మలయాళం భామలు పలు భాషల్లో నటిస్తున్నారు. తాజాగా నటి మాళవిక మోహనన్‌(Malavika Mohanan) హీరోయిన్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీనియర్‌ మలయాళ ఛాయగ్రాహకుడు మోహనన్‌ వారసురాలే మాళివిక. 2013లో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు మాళవిక. ఓ మలయాళ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ బీజి నటిగా మారారు. రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా నటించిన పేట(Peta) చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన మాళవిక అందులో శశికుమార్కు భార్యగా కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో(Thalapathy Vijay) మాస్టర్‌(Master) సినిమాలో, ధనుష్‌తో(Danush) మారన్‌(Maran) చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్‌(Vikram) సరసన తంగలాన్‌(Tangalan) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ను కొత్తగా చూస్తారని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన మాళవిక మోహనన్‌ స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తేనే హీరోయిన్లకు క్రేజ్‌ వస్తుందని అన్నారు. ' మా అమ్మగారు ఏడు, ఎనిమిది దశకాల్లో మలయాళం సినిమాలు ఎక్కువగా చూసేశారు. హీరోయిన్లు మంచి కథా పాత్రలలో నటిస్తే అభినందించేవారు. అలాంటి పాత్రల కోసం ప్రార్థించుకోవాలని చెప్పేవారు. అప్పట్లో ఆమె చెప్పింది నా మనసుకు ఎక్కలేదు. మా అమ్మ చెప్పింది నాకు ఇప్పుడు అర్థమవుతోంది' అని మాళవికా మోహనన్‌ అన్నారు. తాను ఇప్పటికే నటిగా ఒక రౌండ్‌ చుట్టేశానని, ఇకపై మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానని మాళవిక మోహనన్‌ అన్నారు.

Updated On 8 July 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story