విక్రమ్‌(Vikram) హీరోగా దర్శకుడు పా.రంజిత్‌(pa. Ranjith) రూపొందిస్తున్న సినిమా తంగలాన్‌(thangalan)! ఇందులో హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌(Malavika Mohanan) నటిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ సినిమాను కేజీ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో మరో ప్రధాన పాత్రను పార్వతి పోషిస్తున్నారు. ఈ సందర్భంగా తంగలాన్‌లోని మాళవికా మోహనన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

విక్రమ్‌(Vikram) హీరోగా దర్శకుడు పా.రంజిత్‌(pa. Ranjith) రూపొందిస్తున్న సినిమా తంగలాన్‌(thangalan)! ఇందులో హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌(Malavika Mohanan) నటిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ సినిమాను కేజీ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో మరో ప్రధాన పాత్రను పార్వతి పోషిస్తున్నారు. ఈ సందర్భంగా తంగలాన్‌లోని మాళవికా మోహనన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఆగస్టు 4వ తేదీ ఆమె పుట్టిన రోజు కావడంతో బెస్ట్ బర్త్‌ డే డిఫ్ట్ అని ఈ పోస్టర్‌ను ఉద్దేశించి మాళవిక ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు మాళవికా మోహనన్‌. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. మాళవిక మలయాళంలోనే కాదు తమిళం, హిందీ, తెలుగులో కూడా సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఆమె సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్‌ నెటిజన్లును అమితంగా ఆకట్టుకుంటుంది. మంత్రముగ్ధులను చేసే అందం ఆమె సొంతం. ఎలాంటి డ్రస్సులోనైనా ఆమె అందంగా ఉంటుంది. ఈ మలబార్‌ భామకు నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated On 5 Aug 2023 10:33 PM GMT
Ehatv

Ehatv

Next Story