పవన్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్‏శంకర్ (Harish Shankar) ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు.

ఇదీలా ఉంటే ఈ సినిమాలో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఈ ప్రాజెక్ట్‏లో హీరోయిన్లలో ఒకరిగా చేస్తున్నారని ఓ రూమర్ క్రియేట్ అయింది. దీంతో ఆమె రియాక్ట్ అయ్యి.. ఇప్పుడు నేను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రాజెక్ట్‏లో లేనంటూ.. మరోవైపు పవన్ కల్యాణ్‏ (Pawan Kalyan)పై తనకు విపరీతమైన అభిమానం ఉందని ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చింది.

ఇక ఆమె ఒక అద్భుతమైన సినిమాతో టాలీవుడ్‏కు పరిచయం అవుతున్నానంటూ.. అందులో తాను మెయిన్ హీరోయిన్‏గా నటిస్తున్నానని మాళవిక మోహనన్ (Malavika Mohanan) పేర్కొన్నారు. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్ట్‏లో లేనట్టు ఈ అమ్మడు ఓ క్లారిటీ ఇచ్చేసింది మరి.. ఇక దీని తర్వాత ఇంకా ఏ కొత్త రూమర్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి.

Updated On 22 March 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story