చక్కనమ్మ చిక్కినా అందమే! ఒకప్పుడంటే బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్లను ఇష్టపడ్డారు కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. సన్నగా, నాజూకుగా ఉన్న కథనాయికలను ఇష్టపడుతున్నారు. అందుకే చాలా మంది హీరోయిన్లు జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు.

Malavika Mohan Six Pack
చక్కనమ్మ చిక్కినా అందమే! ఒకప్పుడంటే బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్లను ఇష్టపడ్డారు కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. సన్నగా, నాజూకుగా ఉన్న కథనాయికలను ఇష్టపడుతున్నారు. అందుకే చాలా మంది హీరోయిన్లు జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరైతే సిక్స్ ప్యాక్‌లు(Six pack), ఎయిట్ ప్యాక్‌ల(eight pack) కోసం ట్రై చేస్తున్నారు. ఏం హీరోలేనా? తాము మాత్రం అలా మారలేమా? అంటూ దూసుకుపోతున్నారు.
వదనంలో మెరుపు కాస్త తగ్గినా పర్వాలేదు సన్నబడితే చాలనుకుంటున్నారు. మొన్నామధ్య నటి కీర్తి సురేశ్(Keerthy suresh) ఇలాగే ఎక్సర్‌సైజులు గట్రాలు చేసి బాగా సన్నబడింది. చూడ్డానికి బాగోలేకపోయేసరికి మళ్లీ కసరత్తులు చేసి అందంగా మారింది.. నటి మాళవిక(Malavika Mohan) మోహన్ కూడా కీర్తి సురేశ్ అడుగుజాడల్లో నడుస్తోంది. జీరోసైజ్ కోసం తెగ కష్టపడుతోంది.
నిజానికి ఆమెది జీరోసైజే! మరెందుకీ ఎక్సర్‌సైజులు అంటే! సిక్స్ ప్యాక్ కోసమట! అందుకే ఎక్కువ సమయం జిమ్‌లోనే ఉంటుందీ అందాల భామ! రజనీకాంత్(Rajikanth) హీరోగా వచ్చిన పేట(Petta) చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన ఈ నటి తర్వాత లోకేశ్ కనకరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా వచ్చిన మాస్టర్‌లో(Master) నటించారు. ధనుష్‌తో(dhanush) మారన్(Maran) చిత్రంలో నటించారు. ఇవేవీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు విక్రమ్‌తో తంగలాన్ అనే సినిమాలో కలిసి నటించబోతున్నారు.
పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలాన్‌లో విక్రమ్ గెటప్ ఇప్పటికే ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఈ సినిమా కోసం విక్రమ్ పూర్తిగా ఆదివాసిలా మారిపోయారు. ఈ సినిమా కోసమే మాళవిక మోహన్ కూడా కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్‌కు మారారట! దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాళవిక మోహన్. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అసలు ఏమైనా తింటున్నావా, కాస్త మంచినీళ్లయినా తాగమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు.
