ప్రస్తుతం మలైక అరోరా టీవీ షోలతో బిజీగా ఉన్నారు. ఓటీటీలో కూడా అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈమె తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. అర్జున్ కపూర్(Arjun Kapoor) ఎవరో తెలుసుగా! బోనీ కపూర్(Bhoni Kapoor) కొడుకు. సరే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు కానీ పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఇద్దరూ చెప్పడం లేదు. సోషల్ మీడియాలో అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోలను మాత్రం మలైకా షేర్ చేస్తూ ఉంటారు
సోషల్ మీడియాలో(social media) ఏ పోస్టు పెట్టాలి? ఏది పెట్టకూడదు అన్న విచక్షణ రోజురోజుకీ లోపించిపోతున్నది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి, ఫాలోవర్స్ పెరగడానికి ఇష్టం వచ్చింది షేర్ చేస్తున్నారు కొందరు. ఇలాంటి కోవలోకే బాలీవుడ్ నటి మలైకా అరోరా(Malaika Arora) కూడా వస్తారు. స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులరైన ఈవిడ గురించి చెప్పడానికి ఏముంటుంది? ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ అన్న విషయం తెలిసిందే! ఆయనతో పలు చిత్రాలు నిర్మించిందన్న విషయమూ తెలిసిందే.
ప్రస్తుతం మలైక అరోరా టీవీ షోలతో బిజీగా ఉన్నారు. ఓటీటీలో కూడా అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈమె తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. అర్జున్ కపూర్(Arjun Kapoor) ఎవరో తెలుసుగా! బోనీ కపూర్(Bhoni Kapoor) కొడుకు. సరే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు కానీ పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఇద్దరూ చెప్పడం లేదు. సోషల్ మీడియాలో అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోలను మాత్రం మలైకా షేర్ చేస్తూ ఉంటారు.
లేటెస్ట్‌గా తన లవర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నా లేజీ బాయ్ అంటూ ఓ కాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకొస్తున్నారు. 'ప్రేమకు వయసుతో పని లేదు, సరే, మీ జీవితం మీ ఇష్టం. కానీ ఒక టీనేజ్ పిల్లవాడికి తల్లయి ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంతమంది
అతడిని ప్రశ్నలతో గుచ్చిగుచ్చి చంపుతారు' అని ఒకరు చెడుగుడు ఆడేస్తే, మరో నెటిజన్ 'పాపం ఈమె చేసే చీప్ పనుల వల్ల అతడు తన స్కూల్ లేదా కాలేజీలో నవ్వులపాలు కావాల్సి వస్తోంది' అని కామెంట్ చేశారు. ఇంకొకరు ' నీకేమైనా పిచ్చి పట్టిందా? మరీ హద్దు మీరుతున్నావు. ఇలాంటివి పోస్ట్ చేయడం అవసరమా?' అని మలైకాను తిట్టిపోశారు. ' కన్నకొడుకు నీతో ఎక్కువగా ఉండటానికి ఎందుకు ఇష్టపడడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది' అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ బెడ్‌రూమ్ విషయాలు కూడా నెట్‌లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు' అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.