బాలీవుడ్‌ నటి మలైకా అరోరా(Malaika Arora) ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజులుగా మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor)తో బ్రేకప్‌ చేసుకున్నారంటూ సోషల్‌ మీడియా(Social Media)లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నెట్టింట ఇవి చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మలైకా అరోరా రియాక్టవ్వాల్సి వచ్చింది. వదంతులకు గట్టి కౌంటర్‌ ఇచ్చారామె!

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా(Malaika Arora) ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజులుగా మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor)తో బ్రేకప్‌ చేసుకున్నారంటూ సోషల్‌ మీడియా(Social Media)లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నెట్టింట ఇవి చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మలైకా అరోరా రియాక్టవ్వాల్సి వచ్చింది. వదంతులకు గట్టి కౌంటర్‌ ఇచ్చారామె! ఆదివారం అర్జున్‌ కపూర్‌తో లంచ్ డేట్‌కు వెళ్లి మలైకా ఆరోరా బ్రేకప్‌ రూమర్స్‌(Breakup Rumours)కు చెక్ పెట్టారు. లేటెస్ట్‌గా ముంబయిలోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బ్రేకప్‌ రూమర్స్‌ రావడానికి ఓ కారణం ఉంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌ కపూర్‌ సోదరీమణులు అన్షులా కపూర్‌, జాన్వీ కపూర్‌లతో పాటు అర్జున్‌ ఫ్యామిలీని మలైకా అరోరా అన్‌ఫాలో చేయడంతోనే వీరిద్దరి రిలేషన్‌పై వదంతులు మొదలయ్యాయి. కాగా ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్‌కి రిలేషన్ ఉందన్న వార్తలు కూడా సోషల్‌ మీడియాలో హోరెత్తాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించారనుకోండి. గతంలోలాగే తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని, తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నామని మలైకా అరోరా ప్రకటించారు. మలైకా అరోరా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో కలిసి నటించారు. 2008లో తన మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి అర్బాజ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా వచ్చిన దబాంగ్‌ సిరీస్‌లను నిర్మించింది ఈ ప్రొడక్షన్స్‌ హౌసే! 2017లో అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్నారు మలైకా అరోరా. ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నారు.

Updated On 28 Aug 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story