సూపర్ స్టార్ మహేష్‏బాబు కూతురు సితార ఘట్టమనే(Sitara Ghattamaneni)ని గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఈ అమ్మాయి తన వీడియోలు, ఫొటోలతోపాటు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

సూపర్ స్టార్ మహేష్‏బాబు కూతురు సితార ఘట్టమనే(Sitara Ghattamaneni)ని గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఈ అమ్మాయి తన వీడియోలు, ఫొటోలతోపాటు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అది అలా ఉంటే సితార ఇప్పుడు ఓ పెద్ద జ్యువెలరీ యాడ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. అదేటంటే పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‏గా నిలిచింది.

చిన్న ఏజ్‏లోనే ఇంతపెద్ద యాడ్ కాంట్రాక్ట్‏పై సంతకం చేసిన తొలిస్టార్ కిడ్‏గా నిలిచింది సితార. దీనికి సంబంధించిన షూట్ ఇటీవలే జరిగింది. ఈ షూట్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‏లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ యాడ్‏కి సితార రెమ్యునరేషన్ భారీగానే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కమర్షియల్ యాడ్ షూట్‏కు టాప్ టెక్నిషియన్లు, సిబ్బంది పని చేశారట.

ఇక మహేష్ బాబు(Mahesh Babu), నమ్రత (Namratha)లు తన కుమార్తె ప్రోగ్రెస్ చూసి గర్వంగా ఫీలవుతున్నారట. ఈ యాడ్‏ను టీవీలతోపాటు ఇతర ప్లాట్‏ఫామ్‏లలో కూడా ప్రమోషన్స్ ఉంటాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సితార తన డ్యాన్స్, ఇతర యాక్టివిటీస్‏తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ స్టార్ కిడ్‏కి ఇప్పటికే ఇన్‏స్టా‏గ్రామ్‏లో 1.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటి ఇప్పుడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తోంది.

Updated On 26 May 2023 11:42 PM GMT
Ehatv

Ehatv

Next Story