దర్శక రచయిత త్రివిక్రమ్‌(Trivikram) లేటెస్ట్‌ సినిమా గుంటూరు కారంలో(Guntur Karam) ఘాటు అసల్లేదు. చూసినవాళ్లకు అసలు ఈ సినిమాను తీసింది త్రివిక్రమేనా అన్న డౌటానుమానం వచ్చేస్తుంది. అజ్ఞాతవాసి-2(Agathavasi-2) అని ప్రేక్షకులు ఆడిపోసుకుంటున్నారంటే సినిమా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అభిమానులలో కాంతిని నింపలేదు సరికదా! మొహాలు మాడేట్టుగా చేసింది. అలవైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఆడియాసలు అయ్యాయి.

సంక్షిప్తంగా సినిమా కథేమిటంటే..

జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(Prakash Raj) కూతురు వైరా వసుంధర(Ramya Krishna) ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అవుతుంది. కూతురును మంత్రి చేయాలన్నది సూర్యనారాయణ కోరిక. ఆ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే కాటా మధు (Ravishankar)కి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుంటాడు. ఒకవేళ తనను కాదని కూతురుకు మంత్రి పదవిని కట్టబెడితే ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని, మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు. మధు బెదిరింపులకు భయపడకుండా కూతురునే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. అంతకు ముందు వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(Mahesh babu)ను పిలిపిస్తాడు. తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్‌ పేపర్స్‌ మీద సంతకం పెట్టమంటాడు. ఈ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి (Murali sharma) అనే తన సొంత లాయర్ కి అప్పగిస్తాడు వెంకటస్వామి ఈ సారంగపాణి కూతురు ఆముక్తమాల్యద (sreeleela). ఈ క్రమంలో రమణ, ఆముక్తమాల్యద మధ్యలో ప్రేమ మొదలవుతుంది. రమణ మాత్రం సంతకం పెట్టడు. తండ్రి రాయల్‌ సత్యం(Jayaram) చెప్పినా వినడు. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు.

అసలు వసుంధర మొదటి భర్త రాయల్‌ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్‌ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (Meenakshi choudhary) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే ఫస్ట్‌ ట్వంటీ మినిట్స్‌లోనే సినిమా ఎలా ఉండబోతున్నదో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. అయినా త్రివిక్రమ్‌ పై ఉన్న గుడ్డి నమ్మకంతో ఏదో ఒక అద్భుతం జరగకుండా ఉండదనుకుని ఆసాంతం చూస్తున్నారు. నిజానికి ఇంటర్వెల్‌ వరకు హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టే సినిమా తిరుగుతుంది. అప్పుడే సినిమా చుట్టేసిందని తెలిసిపోయింది. ఇంటర్వెల్ తర్వాత అయినా బాగుందా అంటే అదీ లేదు. రెండో సగభాగం అంతా తల్లీకొడుకుల ఈక్వేషన్‌ తేల్చడానికే సరిపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగు లేదు. అసలు కొన్ని డైలాగులు వింటే రాసింది త్రివిక్రమేనా అన్న సందేహం కలుగుతుంది. అత్తారింటికి దారేది సినిమాలో అత్త మేనల్లుడి సెంటిమెంట్ వర్కవుటయ్యిందని చెప్పి ఇక్కడ అమ్మ కొడుకు సెంటిమెంట్ పెట్టాడు. ఒక్కసారైతే చూస్తారు కానీ పదే పదే తీసిందే తీస్తూ పోతే ఎవరూ చూడరు. ఈ విషయాన్ని త్రివిక్రమ్‌ గుర్తుంచుకుంటే మంచిది.

Updated On 12 Jan 2024 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story