మిల్క్ బాయ్ మహేష్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు మహేష్ బాబు గ్లామర్ పెంచేస్తున్నాడు. దాంతో పాటు ఫిట్నెస్ కూ ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రిన్స్. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28 మూవీ కోసం మిల్క్ బాయ్ తన ఫిట్ నెస్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే మాటల మాంత్రికుడు మహేష్ తో చేస్తున్న మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో పూజా హెగ్డెతో పాటు ‘ధమాకా’ […]
మిల్క్ బాయ్ మహేష్ బాబు గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు మహేష్ బాబు గ్లామర్ పెంచేస్తున్నాడు. దాంతో పాటు ఫిట్నెస్ కూ ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రిన్స్.
తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28 మూవీ కోసం మిల్క్ బాయ్ తన ఫిట్ నెస్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే మాటల మాంత్రికుడు మహేష్ తో చేస్తున్న మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ మూవీలో పూజా హెగ్డెతో పాటు ‘ధమాకా’ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ మూవీ కోసం మహేష్ జిమ్ కి వెళ్తున్నాడు. తను జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశాడు.
ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘హాలీవుడ్ రేంజ్ లోడింగ్’ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని హారిక-హాసిని బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.