మిల్క్‌బాయ్ మహేష్‌బాబు (Mahesh Babu) తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28 టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్ఎస్ఎంబీ28 చిత్రానికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ వీడియోలో మహేష్‌బాబు యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు ప్యూర్ మాస్ లుక్‌తో కనిపించారు.
మిల్క్‌బాయ్ మహేష్‌బాబు (Mahesh Babu) తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28 టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్ఎస్ఎంబీ28 చిత్రానికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ వీడియోలో మహేష్‌బాబు యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు ప్యూర్ మాస్ లుక్‌తో కనిపించారు. మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, వింటేజ్ లుక్‌తో మహేష్ అదరగొట్టేశాడు. ఈ టైటిల్‌ను హైలీ ఇన్ ఫ్లామబుల్ #గుంటూరు కారం అని ట్వీట్ వేశారు. అయితే సినిమాలో మహేష్ కుటుంబం గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడంతో ఈ టైటిల్‌ను పెట్టారని సమాచారం. ప్రస్తుతం సినిమా గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
టైటిల్‌ను బట్టి చూస్తే సినిమా అంతా మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఫస్ట్ లుక్ వీడియోలో మహేష్ రౌడీలను చితక్కొడుతూ కనిపించారు. ‘ఏంది అట్టా జూస్తున్నవ్.. బీడీ త్రీడీలో కనపడతందా’ అనే డైలాగ్ వీడియోలో ఇన్టెన్సివ్ క్రియేట్ చేసింది. ఇటు థమన్ మ్యూజిక్ కూడా ప్లస్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఇవాళ ఉదయం కృష్ణ మొదటి యానివర్శరీ సందర్భంగా మహేష్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. పోస్టర్ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో 12 ఏళ్ల తర్వాత వస్తున్న మూడో చిత్రం ఈ గుంటూరు కారం (Guntur Kaaram). గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా(Khaleja), అతడు (Athadu) చిత్రాలు వచ్చాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్‌ను అందించింది. 2019లో మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. అదలా ఉంటే హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిత్రానికి సంగీతం ఎస్. థమన్ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా ఉన్నారు.
గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు కావడంతో అదే సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎస్ఎస్ఎంబీ28 సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ మొత్తానికి తీసుకుంది.