సూపర్‌స్టార్ మహేశ్‌బాబు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో ఆయనే నంబర్‌వన్ స్టార్ అని అంటుంటారు.. అందుకు కారణం వరుస విజయాలు. ఈ మధ్యనే వచ్చిన సర్కారువారి పాట కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది.. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆర్డియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు మహేశ్‌బాబు. సినిమా షూటింగ్ కూడా అనుకున్న విధంగానే సాగుతోంది.. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ఓ […]
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో ఆయనే నంబర్‌వన్ స్టార్ అని అంటుంటారు.. అందుకు కారణం వరుస విజయాలు. ఈ మధ్యనే వచ్చిన సర్కారువారి పాట కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది.. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆర్డియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు మహేశ్‌బాబు. సినిమా షూటింగ్ కూడా అనుకున్న విధంగానే సాగుతోంది.. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నారన్నది సినిమా అభిమానులకు తెలిసిన విషయమే.
మహేశ్‌ను డిఫరెంట్ లుక్‌లో ప్రజెంట్ చేయాలన్నది రాజమౌళి భావన. అందుకే ఓ అడ్వెంచర్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీని సిద్ధం చేశారు. స్క్రీన్‌ప్లే వర్క్ జరుగుతోంది. ఆఫ్రికాలోని దట్టమైన అడవి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఇదే విషయాన్ని సూచన ప్రాయంగా చెప్పారు. ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ జోనర్ లో మహేష్ సినిమా ఉంటుందంటున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే స్టైల్ లో ఉంటుందంటున్నారు . రాజమౌళికి సుకుమార్ దర్శకత్వం వహించిన నేనొక్కడినే సినిమా చాలా ఇష్టం. . అందులో మహేష్ లుక్ హాలీవుడ్ హీరోలా ఉంటుందని అప్పుడెప్పుడో తన మనసులో మాట చెప్పారు జక్కన్న. ఇప్పుడు ఇదే స్టైల్ లో రాజమౌళి సినిమాలో మహేశ్ కనిపించబోతున్నారు. కొసమెరుపు ఏమిటంటే మహేష్ లుక్‌పై జక్కన్న సుకుమార్ సలహా తీసుకోవడం.