బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan) సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నానని నటుడు మహేశ్‌బాబు(Mahesh babu) తాజాగా ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవాలని కోరుకున్నాడు. దీనిపై షారూక్‌ స్పందించారు. మహేశ్‌తో కలిసి తాను కూడా సినిమాటైమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్టు షారూక్‌ చెప్పారు. 'థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. జవాన్‌ చిత్రం నీకు నచ్చుతుందని అనుకుంటున్నా.

బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan) సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నానని నటుడు మహేశ్‌బాబు(Mahesh babu) తాజాగా ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకోవాలని కోరుకున్నాడు. దీనిపై షారూక్‌ స్పందించారు. మహేశ్‌తో కలిసి తాను కూడా సినిమాటైమ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్టు షారూక్‌ చెప్పారు. 'థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. జవాన్‌ చిత్రం నీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే.. నేనూ నీతో కలిసి సినిమాకి వస్తా. నీకు, నీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు' అని షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌(Tweet) చేశారు. ప్రస్తుతం ఇది సీని ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. షారుక్‌ఖాన్‌ - మహేశ్‌బాబు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. గతంలో బ్రహ్మోత్సవం(Brahmotsavam) సెట్‌కి షారుక్‌ ఖాన్‌ ప్రత్యేకంగా వెళ్లి మహేశ్‌ బాబును కలిశారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఇక, జవాన్‌ విషయానికి వస్తే దర్శకుడు అట్లీ - షారుఖ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది! యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇందులో షారుఖ్‌ దాదాపు 7 గెటెప్స్‌లో కనిపిస్తారు. నయనతార హీరోయిన్‌గా నటించారు. దీపికా పదుకొణె అతిథి పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, విజయ్‌(Vijay), అల్లు అర్జున్‌ అతిథి పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో సంజయ్‌ దత్‌(Sanjay Dutt) కనిపించారట!. తమిళ వెర్షన్‌లో అదే పాత్రను విజయ్‌, తెలుగులో అల్లు అర్జున్‌(Allu arjun) పోషించారని అంంటున్నారు.

Updated On 7 Sep 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story