మహేశ్‌బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో వచ్చిన ఖలేజా(Khaleja) సినిమా పెద్దగా ఆడలేదు కానీ టీవీలో వచ్చిన ప్రతీసారి మంచి రేటింగ్‌ను సంపాదించుకుంటోంది. సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని ఫ్యాన్స్ అంటుంటారు. సినిమాలో మహేశ్‌బాబు బాడీ లాంగ్వేజ్(Body language), కామెడీ(comedy) టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. 13 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం నెలకొంది.
మహేశ్‌బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో వచ్చిన ఖలేజా(Khaleja) సినిమా పెద్దగా ఆడలేదు కానీ టీవీలో వచ్చిన ప్రతీసారి మంచి రేటింగ్‌ను సంపాదించుకుంటోంది. సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని ఫ్యాన్స్ అంటుంటారు. సినిమాలో మహేశ్‌బాబు బాడీ లాంగ్వేజ్(Body language), కామెడీ(comedy) టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. 13 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం నెలకొంది. అంతకు ముందే ఖలేజా టైటిల్‌ను ఓ వ్యక్తి నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేసుకున్నారు.
మహేశ్‌బాబు సినిమాకు ఈ టైటిల్‌ను ప్రకటించేసరికి సదరు వ్యక్తి తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టుకు వెళ్లాడు. సినిమా విడుదల కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్(Injection Order) ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అన్ని డ్యాకుమెంట్లను పరిశీలించిన న్యాయమూర్తి ఆ వ్యక్తికి ఓ సూచన చేశారు. వాళ్లు ఇప్పటికే షూటింగ్, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశారు.
' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ టైమ్‌లో సినిమా విడుదలకాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదేమో. నష్టపరిహారం(compensation) కోరడం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు. మీరు ఎంత అనుకుంటున్నారో చెప్పండి’ అని సదరు వ్యక్తిని అడిగారు జడ్జి. తుది తీర్పును లంచ్ తర్వాత ప్రకటిస్తానని న్యాయమూర్తి అన్నారు. దీంతో సదరు వ్యక్తి పది లక్షల రూపాయలను పరిహారం కింద కోరారు.
ఖలేజా నిర్మాతలు(Producers) కూడా పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సుముఖత తెలిపారు. న్యాయమూర్తే స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తన మనసు మార్చుకున్నారు. లంచ్ తర్వాత కోర్టు మళ్లీ ప్రారంభమయ్యింది. అప్పుడు తనకు పది లక్షలు సరిపోవని, పాతిక లక్షలు ఇవ్వాలని కోరాడు.
దీంతో కాసేపు వాదోపవాదనలు జరిగాయి. మొదట పది లక్షలు తీసుకునేందుకు ఒప్పుకుని తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసింది. దీంతో ‘ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేం. అలాగే తుది నిర్ణయమూ తీసుకోలేం. మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటివరకూ సినిమా ఆగకుండా కోర్టు ఆపలేదు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి. అప్పటివరకూ మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా’ అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దీంతో ఖలేజా టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి బిత్తరపోయాడు. మరోవైపు సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేశ్ ఖలేజా అంటూ చిత్ర బృందం సినిమాను విడుదల చేసింది. అత్యాశకు పోయి పది లక్షలను వదులుకున్నాడా వ్యక్తి!