మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా సినిమాలు చేయడమే కాదు.. మంచి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. ఎందరో చిన్నారులకు ప్రాణదాత అయ్యాడు. పిల్లల సమస్యలకు ఆపరేషన్లు చేయిస్తూ.. ఆ విషయం బయటకు తెలియకుండా చాలా కాలం గుప్త దాత అయ్యాడు.

Sithara Helping Old Woman
మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా సినిమాలు చేయడమే కాదు.. మంచి మనసున్న మారాజు అనిపించుకున్నాడు. ఎందరో చిన్నారులకు ప్రాణదాత అయ్యాడు. పిల్లల సమస్యలకు ఆపరేషన్లు చేయిస్తూ.. ఆ విషయం బయటకు తెలియకుండా చాలా కాలం గుప్త దాత అయ్యాడు. దాదాపు వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించాడు మహేష్. తండ్రి వారసత్వాన్ని.. ఆయన మంచి తనాన్ని పునికి పుచ్చుకుంది ఆయన కూతురు సితార(Sitara). తాజాగా తన మంచితనం అందరిని ఆశ్చర్యపరిచింది.
సితార పాపకు పెద్దల పట్ల గౌరవం, పేదల పట్ట దయ, ఉన్నాయని.. మంచి తనానికి సందర్భాలతో పనిలేదని.. హోదాలు, అంతస్తులు గుర్తురావని సితార తను చేసిన పనితో మరోసారి నిరూపించింది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత(Namratha), వారి కూతురు సితార హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందించారు.
ఈ కానుకలు అందుకోవడానికి స్టేజిపైకి రావడానికి ఓవయసు మళ్లిన వృద్ధురాలు ఇబ్బంది పడగా.. ఏమాత్రం ఆలోరచించకుండా.. మహేష్ బాబు కూతురు సితార వెంటనే స్టేజి దిగి కిందకు వెళ్ళింది. ఆ వృద్ధురాలు భుజం పట్టుకుని మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత వారితో కలిసిపోయి నవ్వుతూ ఫొటోలు దిగింది. ఈ ఒక్క సంఘటన చాలు సితార మంచితనం తెలియడానికి. అయితే ఇది గతంలో జరిగిన సంఘటన కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోతో పాటు..మహేష్ గతంలో ఓ మహిళకు ఇలాగే సహాయం చేసిన వీడియోను కలిపి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Both SuperStar @urstrulyMahesh & Princess #Sitara Had Such Kind Heart's...!! ❣️#GunturKaaram pic.twitter.com/Em9Ft4dQNt
— Guntur Mahesh FC™ (@Guntur_MBFC) September 30, 2023
