సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఆటోగ్రాఫ్(Autograph) ఎలా ఉంటుందో తెలుసా...? ఎప్పుడైనా చూశారా..? ఆటోగ్రాఫ్ ల కాలం పోయింది. ప్రస్తుతం పోటోగ్రాఫులు కూడా కాదు.. సెలబ్రిటీలు కనిపిస్తే.. సెల్ఫీలు అడిగేస్తున్నారు. పెన్ను పేపరు క్యారీచేసే రోజులు పోయాయి. కాని ఇప్పటికీ తమ అభిమాన నటుల దస్తూరిని జాగ్రత్తగా దాచుకోవాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కాని..సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించగానే.. ఫోటోసంగతి తరువాత ముందు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగాడట ఫ్యాన్.. అతనెవరో 90స్ కిడ్ అయ్యి ఉంటాడు. వారికి మాత్రమే ఆటోగ్రాఫ్ విలువ తెలుస్తుంది మరి.

అడక్క అడక్క ఆటో గ్రాఫ్ అడిగినందుకో ఏమో.. మహేష్ బాబుకు ముచ్చటేసి.. లవ్ అని పెట్టి మరీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తాజాగా మహేష్ ఆటోగ్రాఫ్ పిక్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. రీసెంట్ గా జర్మనీ వెళ్ళాడు మహేష్ బాబు. అది కూడా సింగిల్ గా వెళ్ళాడు. మహేష్ బాబు ఫారెన్ టూర్లకు వెళ్లడం కొత్తేమి కాదు.. కాని ఇఫ్పుడు వెళ్ళిన జర్మనీ టూర్ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకుంటే మహేష్ వెళ్ళింది బ్యాచిలర్ టూర్ కు. ఏటూర్ కి అయినా..మహేష్ బాబు ఒంటరిగా వెళ్లడు... ఫ్యామిలీని వెంటేసుకునివెళ్ళాల్సిందే. అంటువంటిది.. సూపర్ స్టార్ ఈసారి మాత్రం సింగిల్ గా జర్మనీ వెళ్ళాడు. అదే ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే జర్మనీ కి వెళ్తా వెళ్తా.. ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.దీంతో మహేష్ పలువురు అభిమానులకు ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ ఇవ్వగా అభిమానులు వాటిని తమ సోషల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. ఓ అభిమానికి.. లవ్, మహేష్ బాబు అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు సూపర్ స్టార్. అతను ఆ ఆటోగ్రాఫ్ ను పోటోగ్రాఫ్ గా మార్చి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతుంది.

ఇక ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో అభిమానులు మందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. గుంటూరు కారం సినిమా ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది. త్వరలోనే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా ప్లాన్ చేయబోతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సడెన్ గా జర్మనీకి వెళ్ళాడు. త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం ఆయన మరోలుక్ ను మార్చబోతున్నట్టు తెలుస్తోంది

Updated On 20 Jan 2024 8:11 AM GMT
Ehatv

Ehatv

Next Story