మాస్ బీట్ కు స్టెప్పులేయడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu). ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న సూపర్ స్టార్ సాంగ్ షూట్ కు ముస్తాబుతున్నాడు.

మాస్ బీట్ కు స్టెప్పులేయడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu). ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్న సూపర్ స్టార్ సాంగ్ షూట్ కు ముస్తాబుతున్నాడు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీలీల(Sreeleela) మరియు మీనాక్షి చౌదరిలు(Meenakshi Chaudhary) హీరోయిన్స్ గా మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మూవీ గుంటూరు కారం(Guntur Karam). ఈసినిమాపై భారీ అంచనాలుఉన్నాయి. అయితే ఈమూవీ కూడా పలు కారణాల వల్ల డిలై అవుతూ వస్తోంది.

అందులో మహేష్ బాబు ఫారెన్ టూర్లు సగం అయితే.. మహేష్ ఇంట వరుస మరణాలు మరో కారణం. అటు పూజాకు కాలికి దెబ్బ తగలడంతో మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యింది షూటింగ్. ఇక స్టార్ట్ వుతుంది అనుకుంటే.. డేట్స్ లేవని పూజా(Pooja hegde) ఈప్రాజెక్ట్ నుంచి తప్పకుంది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం అయితే అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది.మేకర్స్ ఈ నవంబర్ 2 నుంచి ఓ సాంగ్ షూట్ ని అయితే స్టార్ట్ చేయనున్నారట. మొత్తం ఐదు రోజులు పాటుగా ఈ సాంగ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో జరపనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్ ఓ మాస్ ట్యూన్ అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అయితే సంగీత దర్శకుడు థమన్ రెండు సాలిడ్ మాస్ ట్యూన్స్ అందించాడని కూడా తెలుస్తుంది. మరి అవెలా ఉంటాయో చూడాలి.

Updated On 28 Oct 2023 8:01 AM GMT
Ehatv

Ehatv

Next Story