హీరో మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ(Krishna) జయంతి సందర్భంగా అంటే ఈ నెల 31వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

హీరో మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వస్తోంది. త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ(Krishna) జయంతి సందర్భంగా అంటే ఈ నెల 31వ తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నామని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఎంపిక చేసుకున్న కొన్ని సినిమా థియేటర్లలో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసేలా చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి.

ఎస్‌. రాధాకృష్ణ(S>Radha Krishna) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Srileela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌(thaman) సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్‌ మొదటివారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి చాలా టైటిల్స్‌ సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. గుంటూరు కారం, ఊరికి మొనగాడు అనే పేర్లలో ఏదో ఒకటి ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా త్రివిక్రమ్‌ మదిలో మరిన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి టైటిల్‌ విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది.

Updated On 27 May 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story