సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇప్పటికే ఎంతో మంది చిన్నారుల జీవితాలను నిలబెట్టాడు . ఇక తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకుని ఇంకొంత మంది జీవితాల్లో వెలుగు నింపబోతున్నారు. ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇప్పటికే ఎంతో మంది చిన్నారుల జీవితాలను నిలబెట్టాడు . ఇక తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకుని ఇంకొంత మంది జీవితాల్లో వెలుగు నింపబోతున్నారు. ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడు.
చాలా మంది చేసిన సాయాన్ని ఊరంతా డప్పు కొట్టి చెప్పుకుంటారు. కాని ఎంత లాస్ వచ్చినా.. ఎంత ఇ్బంది పడ్డరా బయటకు మాత్రం నవ్వుతూనే ఉంటారు మరికోంత మంది. చేసిన సాయం చెప్పుకోకుండా.. మంచిక్రెడిట్ సాధించాడు మహేష్ బాబు. ఆయన దాదాపు వెయ్యి మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు(Heart Operations) తన సొంత ఖర్చుతో చేయించారు. కాని ఆ విషయం మొన్నటి వరకూ బయటకు రాలేదు. ఇక ఈమధ్యనే మహేష్ చేసిన సాయం గురించి అందరికి తెలిసింది. దాంతో ఓహాస్పిటల్(Hospital) లో కలిసి.. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇలా ఇబ్బందిపడుతున్న చిన్నారులకు తాము సర్జరీలు చేయిస్తామన్నారు. అలా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు సూపర్ స్టార్.
ఈ సారి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. అయితే ఈ మంచి పనికి కృష్ణ(Krishna) వర్ధంతి(Death anniversary) కార్యక్రమం వేదిక అయ్యింది. కృష్ణ గారి మొదటి వర్ధంతి సందర్భంగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు మహేష్ అండ్ నమ్రత(Namrutha). ముఖ్యంగా ఎంతో టాలెంట్ కలిగి ఉండి చదువుకోలేకపోతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని నిర్ణయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే పేద విద్యార్థులలో టాలెంట్ కలిగినటువంటి వారిని మహేష్ బాబు ఫౌండేషన్ గుర్తించి వారి చదువు బాధ్యతలు అన్నింటిని తీసుకోబోతున్నారట.
ఈ విషయంలో పూర్తి బాధ్యతను నమ్రత తీసుకున్నట్టు సమాచారం. మావయ్య గారి ఆశీస్సులతో ఇప్పటికే 40 విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి ఎంతవరకు చదవాలి అనిపిస్తే అంతవరకు చదివించే బాధ్యత మహేష్ బాబు ఫౌండేషన్ తీసుకుంటుందని ఇలా 40తో మొదలైనటువంటి ఈ కార్యక్రమం రేపు ఎంతవరకు అయినా వెళ్ళొచ్చని ఇలా చదువుపై ప్రేమ ఉండి.. చదువుకోలేకపోయిన టాలెంటెడ్ పూర్ స్టూడెంట్స్ లో పూర్ అనే మాటను తొలగించి.. టాలెంట్ కు తమ ఆర్ధిక సాయం అందించాలనే.. ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు నమ్రత. ఇక వీరి మంచి మనసుకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.