ప్రిన్స్ మహేశ్‌బాబు(Mahesh babu), దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో సినిమా అంటేనే అదిరిపోయేట్టుగా ఉంటుందని జనాలు ఫిక్సయిపోయారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Mahesh babu, RajamouliMahesh babu, Rajamouli
ప్రిన్స్ మహేశ్‌బాబు(Mahesh babu), దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో సినిమా అంటేనే అదిరిపోయేట్టుగా ఉంటుందని జనాలు ఫిక్సయిపోయారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. షూటింగ్‌ను ఈ ఏడాది చివరలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. దీనికి తగినట్టుగా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు రాజమౌళి బృందం.
ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన ఎవరు నటిస్తారన్నది ఇంకా తేలలేదు. దీపికా పదుకొనే(Deepika padukone), ఆలియాభట్(Alia Bhatt) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరు నటించినా అది రేర్ కాంబినేషన్ అవుతుంది. ఇటీవలే వెకేషన్ కోసం స్పెయిన్‌కు(Spain) వెళ్లిన మహేశ్‌బాబు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ మొదటి వారంలో మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా, జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా!
