తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్(Libra Productions) అధినేత రవీందర్ చంద్రశేఖరన్(Ravinder Chandrasekaran), నటి మహాలక్ష్మి(MahaLakshmi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే కదా! పెళ్లి అయినప్పటి నుంచి ఈ జంట తెగ పాపులరయ్యింది. మహాలక్ష్మి సన్నగా(slim), నాజుగ్గా ఉంటారు. ఆయనదేమో భారీ శరీరం(Heavy Body). జనం ఆడిపోసుకోవడానికి ఇది చాలదూ! డబ్బుల కోసమే మహాలక్ష్మి ఈయనను పెళ్లి చేసుకున్నారంటూ దెప్పిపొడవసాగారు. వీళ్ల వైవాహిక జీవితం ఎంతోకాలం ఉండదంటూ శాడిజాన్ని ప్రదర్శించారు.

Ravinder Chandrasekaran Birthday
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్(Libra Productions) అధినేత రవీందర్ చంద్రశేఖరన్(Ravinder Chandrasekaran), నటి మహాలక్ష్మి(MahaLakshmi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే కదా! పెళ్లి అయినప్పటి నుంచి ఈ జంట తెగ పాపులరయ్యింది. మహాలక్ష్మి సన్నగా(slim), నాజుగ్గా ఉంటారు. ఆయనదేమో భారీ శరీరం(Heavy Body). జనం ఆడిపోసుకోవడానికి ఇది చాలదూ! డబ్బుల కోసమే మహాలక్ష్మి ఈయనను పెళ్లి చేసుకున్నారంటూ దెప్పిపొడవసాగారు. వీళ్ల వైవాహిక జీవితం ఎంతోకాలం ఉండదంటూ శాడిజాన్ని ప్రదర్శించారు. రవీందర్ భారీకాయం చూసి బాడీ షేమింగ్ కూడా చేశారు. సోషల్ మీడియాలో(social media) ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా తమది అన్యోన్య దాంపత్యమని చాటుకోవడానికి ఫోటోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దంపతులకు. పెళ్లి అయి రెండేళ్లలో వీరిద్దరిపై భారీగానే ట్రోలింగ్ జరిగింది. వీరి పెళ్లి పెటాకులయ్యిందని, విడాకులు తీసుకున్నారని ప్రచారం చేశారు. పెళ్లి అయి ఇన్నేళ్లయినా ఇంకా ఎందుకు తల్లివి కాలేదని కూడా కామెంట్ చేశారు.
అయితే ఇవేవీ తమను బాధించమని, తాము చాలా సంతోషంగా ఉన్నామని ఆ జంట చెప్పుకొచ్చింది. ఇటీవలే రవీందర్ బర్త్‌డే(Birthday) ఘనంగా జరుపుకుననారు. ఆ సందర్భంగా తన భర్తకు ఆరు అడుగుల ప్రత్యేక బహుమతిని(Gift) ఇచ్చారు మహాలక్ష్మి. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్లో(Instagram) పంచుకున్నారు కూడా! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ప్రత్యేకమైన బహుమతి ఏమిటంటే ఆరు అడుగుల ఎత్తు ఉన్న రవీందర్ చంద్రశేఖరన్ ఫోటోను(6 Feet Potrait) చక్కటి పెయింటింగ్‌తో తయారు చేయించి తన భర్తకు బర్త్‌డే కానుకగా ఇచ్చారు. తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ 'జీవితంలో నాకు మళ్లీ ధైర్యం తెచ్చిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరే నా బలం. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు లైకులతో పాటు చక్కటి కామెంట్లు పెట్టారు. రవీందర్‌కు విషెస్ చెబుతూనే, చెత్తగా మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఇలా ఆనందంగా జీవితంలో ముందుకు సాగాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
