ప్రముఖ తమిళ సినీ దర్శకుడు.. లింగు స్వామికి కోర్ట్ నుంచి ఊరట లభించింది. మద్రాస్ హైకోర్ట్ ఆయనకు కింది కోర్ట్ నుంచి లింగుస్వామికి వేసిన శిక్ష నుంచి స్టే విధించింది. చెక్ బౌన్స్ కేసు(Cheque Bounce)లో లింగు స్వామికి.. మద్రాస్ హైకోర్ట్(Madras High Court) ఊరటను కల్పించింది. ఆయనకు కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

6 నెలలు జైలు శిక్షపడిని తమిళ దర్శకుడు(Tamil Director) లింగుస్వామి(Lingusamy)కి మద్రాస్ హైకోర్టులో ఊరటనిచ్చింది. జైలు శిక్షపై స్టే విధించింది హైకోర్ట్(High Court). వివరాలేంటంటే..?

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు.. లింగు స్వామికి కోర్ట్ నుంచి ఊరట లభించింది. మద్రాస్ హైకోర్ట్ ఆయనకు కింది కోర్ట్ నుంచి లింగుస్వామికి వేసిన శిక్ష నుంచి స్టే విధించింది. చెక్ బౌన్స్ కేసు(Cheque Bounce)లో లింగు స్వామికి.. మద్రాస్ హైకోర్ట్(Madras High Court) ఊరటను కల్పించింది. ఆయనకు కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు కేసు వివరాల్లోకి వెళ్తే... లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సినిమాను నిర్మించడం కోసం పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి 2014లో ర 1.3 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వాటితి తిరిగి చెల్లించే విషయంలోనే అసలు సమస్య మొదలయ్యింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో 1.35 కోట్లకు లింగు స్వామి చెక్ ను ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అవ్వడంతో షాక్ అయ్యారు పీవీపీ యజమానులు

లింగు స్వామి ఇచ్చిన చెక్ కు సబంధించిన బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో.. ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ కేపిటల్స్ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. లింగు స్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆయన తో పాటు ఆయన సోదరుడికి కూడా 6 నెలల జైలు శిక్షను విధించింది.

ఇక కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. లింగు స్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వి.శివజ్ఞానం సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది.లింగుస్వామి తరపున హాజరైన న్యాయవాది ఇప్పటికే 20 శాతం సొమ్మును చెల్లించామని, మరో 20 శాతం సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో 20 శాతం సొమ్మును ఆరు వారాల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ కింది కోర్టులు ఖరారు చేసిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఆదేశించారు.

తెలుగు, తమిళ భాషల్లో రామ్ హీరోగా ది వారియర్ మూవీని డైరెక్ట్ చేశారు లింగు స్వామి. టాలీవుడ్ తో పాటు.. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామి తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఆయన ఓ తమిళ స్టార్ హీరో డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated On 27 April 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story