ప్రముఖ తమిళ నటుడు ధనుష్(Danush), ఐశ్వర్య రజనీకాంత్‌లకు(Aishwarya Rajinikanth) చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసును న్యాయమూర్తి కొట్టేశారు. ధనుష్ హీరోగా ఐశ్వర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా వేలైయిల్ల పట్టాదారి(velaiyilla pattathari) ఘన విజయం సాధించింది. 2014, జూలైలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో రఘువరన్ బీటెక్(Raghuvaran B.Tech) పేరుతో డబ్ చేశారు.
ప్రముఖ తమిళ నటుడు ధనుష్(Danush), ఐశ్వర్య రజనీకాంత్‌లకు(Aishwarya Rajinikanth) చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసును న్యాయమూర్తి కొట్టేశారు. ధనుష్ హీరోగా ఐశ్వర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా వేలైయిల్ల పట్టాదారి(velaiyilla pattathari) ఘన విజయం సాధించింది. 2014, జూలైలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో రఘువరన్ బీటెక్(Raghuvaran BTech) పేరుతో డబ్ చేశారు. ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది. ఇందులో ధనుష్ సిగరెట్లు(Cigarettes)తాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సందర్భాలలో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి చట్టపరమైన నిబంధనలు పాటించలేదంటూ టుబాకో నిరోధక శాఖ అప్పట్లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదు మేరకు ఆరోగ్య శాఖ సహాయక నిర్వాహకుడు చెన్నై, సైదాపేట కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో తాము వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆదేశాలు జారీ చేయాలని, తమపై కేసును కొట్టివేయాలని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడివిడిగా చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధనుష్ తీర్పును న్యాయవాది విజయ్ సుబ్రమణియన్(Vijay Subramanian) హాజరై వాదించారు. వాదనల అనంతరం ఈ కేసులో సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు నాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే కదా!