నటి జయప్రదకు క‌ష్టాలు పెరుగ‌నున్నాయి. ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకల కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆమెకు చుక్కెదురైంది

నటి జయప్రద(Jayaprada)కు క‌ష్టాలు పెరుగ‌నున్నాయి. ఉద్యోగులకు ఈఎస్ఐ(ESI) చెల్లింపుల్లో అవకతవకల కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆమెకు చుక్కెదురైంది. కోర్టు ఆమెను 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడమే కాకుండా.. రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు(Madras High Court) తీర్పు వెలువరించింది.

రామ్‌కుమార్(Ram Kumar), రాజ్‌బాబు(Raj Babu) అనే ఇద్ద‌రు పార్ట్‌న‌ర్‌ల‌తో కలిసి జయప్రద చెన్నైలో ఓ థియేటర్(Theatre) నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం(Court) జయప్రదతో సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది.

కోర్టు తీర్పును సవాలు చేస్తూ జయప్రద హైకోర్టులో అప్పీలు(Appeal) చేసుకున్నారు. పిటిషన్‌(Petition)పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి, ఈఎస్‌ఐ బాకీ కింద రూ.37.28 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని జయప్రదను కోరారు. రూ.20 లక్షలు చెల్లిస్తానని ఆమె చెప్పగా.. ఈఎస్ఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం జయప్రద పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

Updated On 20 Oct 2023 10:42 PM GMT
Yagnik

Yagnik

Next Story