✕
Madhubala : దిలీప్-మధుబాల...ఓ విఫల ప్రయణగాథ
By EhatvPublished on 23 Feb 2024 5:48 AM GMT
ఇవాళ ప్రణయ దేవత మధుబాల(Madhu bala) వర్ధంతి. మొన్నే అంటే ప్రేమికుల రోజున ఆ సౌందర్యరాశి జయంతి సందర్భంగా ఆమె గురించి చెప్పుకున్నాం. మళ్లీ ఇండియన్ వీనస్ గురించి ఏం చెబుతాం? అర్థాంతరంగా ముగిసిన ఆమె జీవితం గురించి ప్రస్తావించుకున్నాం కానీ ఆమె విఫల ప్రేమకథను(Love story) చెప్పుకోలేదు.

x
Madhubala
-
- ఇవాళ ప్రణయ దేవత మధుబాల(Madhu bala) వర్ధంతి. మొన్నే అంటే ప్రేమికుల రోజున ఆ సౌందర్యరాశి జయంతి సందర్భంగా ఆమె గురించి చెప్పుకున్నాం. మళ్లీ ఇండియన్ వీనస్ గురించి ఏం చెబుతాం? అర్థాంతరంగా ముగిసిన ఆమె జీవితం గురించి ప్రస్తావించుకున్నాం కానీ ఆమె విఫల ప్రేమకథను(Love story) చెప్పుకోలేదు. మధుబాలను దిలీప్‌కుమార్(Dilip kumar) అమితంగా ప్రేమించాడు. నిజానికి దిలీప్‌కు ఇది మొదటి ప్రణయమేమీ కాదు. అంతకు ముందు అతడు కామినీ కౌశల్‌ను(Kamini kaushal) ప్రేమించాడు. అదే సమయంలో ప్రేమ్‌నాథ్ ప్రేమలో మధుబాల ఉండింది. అయిదో దశకంలో ప్రేమ్‌నాథ్ చాలా అందంగా ఉండేవాడు. అతడిని ఇండియన్ డగ్లస్ ఫెయిర్‌బాంక్స్ అని పిల్చుకునేవాళ్లు. రాజ్‌కపూర్ భార్య కృష్ణ మల్హోత్రాకు స్వయాన సోదరుడు. దిలీప్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఆ రోజుల్లో ప్రేమ్‌నాథ్ అమ్మాయిల కలల రాకుమారుడు. 1951లో వచ్చిన బాదల్ సినిమాలో ప్రేమ్‌నాథ్ సరసన మధుబాల నటించింది.
-
- అప్పడే అతడిపై మధుబాల మనసు పారేసుకుంది. ప్రేమ్‌నాథ్ హిందు. మధుబాలేమో ముస్లిం. తండ్రికి తెలిస్తే చంపేస్తాడని మధుబాల భయపడింది. దిలీప్‌తో క్లోజ్‌గా మూవ్ అయినా తండ్రి ఏమనేవాడు కాదు. ఎందుకంటే దిలీప్ ముస్లిం కాబట్టి. పైగా హీరోగా స్థిరపడిపోయాడు. తన కూతురు ద్వారా దిలీప్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ ఆలోచన. దిలీప్-మధుబాల జంటగా సినిమాలు తీసి బాగా సంపాదించవచ్చన్న ఆశ! 1952లో వచ్చిన ఆన్ సినిమాలో దిలీప్ హీరో అయితే విలన్ వేషం వేసింది ప్రేమ్‌నాథ్. షూటింగ్ అయ్యాక ఇద్దరూ కలిసి మధుబాల ఇంటికి వచ్చేవారు. ప్రేమ్‌నాథ్ కార్లో నక్కి కూర్చునేవాడు. మధుబాలను దిలీప్ బయటకు తీసుకెళతానంటే అతావుల్లా ఖాన్ అంగీకరించేవాడు. కారు గల్లీ మలుపు తిరగ్గానే ప్రేమ్‌నాథ్ బయటకు వచ్చేవాడు. కొన్నాళ్లపాటు ఇలా ప్రేమవ్యవహారం సాగింది. ఒకానొక సందర్భంలో ప్రేమ్‌నాథ్ సరదాకీ ఓ మాటన్నాడు.
-
- దిలీప్-ది డాంకీ అనే సినిమా తీస్తానని, అందులో దిలీప్ హీరో అయితే తాను డాంకీనని చెప్పాడు. ఈ మాటకు దిలీప్‌కు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ప్రేమ్‌నాథ్‌తో మాట్లాడటం మానేశాడు. తర్వాతి రోజుల్లో శాంసన్ అండ్ డెలైలా కథ ఆధారంగా భగవాన్ దాస్ వర్మ తీసిన ఔరత్ అనే సినిమా ప్రేమ్‌నాథ్, బీనా రాయ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా అప్పుడే బీనా రాయ్ ప్రేమలో పడిపోయాడు ప్రేమ్‌నాథ్. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయంలో దిలీప్‌కు మధుబాల దగ్గరయ్యింది. తను ప్రేమించిన మధుబాల, దిలీప్ దగ్గరకావడం ప్రేమ్‌నాథ్‌కు బాధించింది. అందుకు బదులు తీర్చుకోవాలనుకున్నాడు. ఒకప్పుడు దిలీప్ గాఢంగా ప్రేమించిన కామినీ కౌశల్‌ను తన వలపు వలలో బంధించాడు. 1977లో ప్రేమ్‌నాథ్ జ్ఞానీజీ అనే సినిమాను నిర్మించాడు. ఇందులో కామినీ కౌశల్ కూడా నటించింది. ఆ టైమ్‌లో ప్రేమ్‌నాథ్ ప్రేమలో కామినీ పడింది.
-
- అప్పటికీ ప్రేమ్‌నాథ్ వయసు 49 ఏళ్లు అయితే కామీని వయసు 48 ఏళ్లు. అప్పటికే ఇద్దరూ క్యారెక్టర్ రోల్స్ వేస్తున్నారు. ఈ వయసులో ప్రేమేమిటని అడక్కండి. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. చండీగఢ్ దగ్గర ఉన్న పింజోరీ గార్డెన్స్‌లో షూటింగ్ జరిగేది. అక్కడే వీరిలో ప్రేమ పుట్టింది. అప్పటికే ఇద్దరికి పెళ్లయ్యి, పిల్లలు కూడా ఉన్నారు. అందుకే వీరిద్దరి ప్రేమ రెండేళ్లకే ముగిసింది. ఈ ఉప కథ నుంచి అసలు కథకు వద్దాం. దిలీప్-మధుబాల మధ్య వయసు తేడా 11 ఏళ్లు ఉంటుంది. అయినప్పటికీ దిలీప్‌తో పెళ్లికి అతావుల్ ఖాన్ ఒప్పుకున్నాడు. కాకపోతే ఓ కండీషన్ పెట్టాడు. కూతురుతో తను తీయబోయే సినిమాల్లో హీరోగా దిలీప్ తప్పనిసరిగా నటించాలి. దిలీప్‌కు ఈ కండీషన్ నచ్చలేదు. ఆ విషయం మధుబాలతో చెప్పాడు. నా మాటగా తండ్రికి చెప్పమన్నాడు. తండ్రిని ఎదిరించే సాహసం చేయలేదు మధుబాల.
-
- పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుంటాయని దిలీప్‌కు నచ్చచెప్పబోయింది. ఇదిలా ఉంటే 1956లో ఢాకే కీ మల్మల్ సినిమా షూటింగ్ సమయంలో నటుడు ఓంప్రకాశ్ సమక్షంలో మధుబాలకు దిలీప్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. కాజీ రెడీగా ఉన్నాడని, సరే నంటే ఇవాళే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కాకపోతే కుటుంబాన్ని వదిలేసి రావాలని కండిషన్ పెట్టాడు. మధుబాల ఎటూ తేల్చుకోలేకపోయింది. దిలీప్ అంటే ఇష్టమే అయినప్పటికీ కుటుంబాన్ని వదిలి రాలేకపోయింది. దాంతో దిలీప్ పెళ్లి ప్రతిపాదన వదిలేసుకున్నాడు. 1957లో దర్శక నిర్మాత బి.ఆర్.చోప్రా తన నయా దౌర్ కోసం దిలీప్, మధుబాలలను తీసుకున్నాడు. ఆ సినిమాలో కొంతభాగం భోపాల్‌లో తీయాలనుకున్నాడు. అలా విడిగా వెళితే మళ్లీ దిలీప్, మధుబాల ప్రేమ బలపడుతుందని అలావుల్ ఖాన్ భావించాడు.
-
- ఔట్‌డోర్ షూటింగ్‌కు తన కూతురు రాదని చెప్పాడు. దాంతో మధుబాలను సినిమాలోంచి తీసేసి ఆమె ప్లేస్‌లో వైజయంతిమాలను సెలెక్ట్ చేశాడు బి.ఆర్.చోప్రా. దాంతో పాటు మధుబాలపై కోర్టులో కేసు కూడా వేశాడు. ఈ కేసులో దిలీప్‌ను సాక్షిగా పిలిపించారు. దిలీప్ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడాన్ని మధుబాల జీర్ణం చేసుకోలేకపోయింది. ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగింది. మాటలు కూడా బందయ్యాయి. అలా దిలీప్-మధుబాల ప్రేమకథ విషాదాంతమయ్యింది. కొసమెరుపు : మొఘల్-ఏ-ఆజమ్ షూటింగప్పుడు దిలీప్-మధుబాల మధ్య మాటలు లేవు. సలీంగా దిలీప్, అనార్కలిగా మధుబాల నటించారు. అనార్కలి అనగానే మనకు గుర్తొచ్చేది మధుబాలే! అయితే ఆ సినిమా చూసినవారెవ్వరూ ఆ చిత్రం షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మాటలు లేవంటే నమ్మలేరు! అంత గొప్పగా రొమాన్స్‌ను పండించారు. ముఖ్యంగా ప్రేమ్ జోగన్ బన్కే పాటలో అద్భుతంగా నటించారు. తాన్సేన్ పాత్ర కోసం బడే గులాం అలీఖాన్ పాడిన ఆ పాట ఒక ఎత్తు అయితే తెరమీద దిలీప్-మధుబాల పండించిన రొమాన్స్ మరో ఎత్తు! ప్రొఫెషనలిజం అంటే ఇదే!

Ehatv
Next Story