కొండా వ్యాఖ్యలకు మంచు విష్ణు(Minchu vishnu) రియాక్షన్!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(MAA) స్పందించింది. రాజకీయ లబ్ధి(Political benefits) కోసం దయచేసి మమ్మల్ని లాగకండి అని చెప్పింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలపై ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'సమాజంలో ఈ మధ్యన జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలలాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. కానీ అవాస్తావమైన కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగడాన్ని ఇష్టం పడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. నాయకులు, రాజకీయ నాయకులు, మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను – దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు, సమాజానికి వినోదం ఇవ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాము. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనమంతా ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం.పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం. మేమంతా ఏకమై నిలబడతాం' అని మంచు విష్ణు రాసుకొచ్చారు.