తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్న కరాటే కల్యాణి (Karate Kalyani) తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన రచ్చే దీనంతటికి కారణం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్న కరాటే కల్యాణి (Karate Kalyani) తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన రచ్చే దీనంతటికి కారణం. ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిషకరించడానికి అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసారు. అయితే ఆ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేశారు. దీనిపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. దీనిపై ఆమె హిందూసంఘాలతో కలిసి కోర్టుకు కూడా వెళ్లారు.

శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించకూడదని కోర్టు స్టే ఇచ్చింది.. ఇప్పుడు ఇదే ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టింది.. అనవసరంగా ఈ విషయంలో దూరి మీడియాలో నానా రచ్చ చేసిన కల్యాణికి మా అసోసియేషన్ (MAA Association) షాక్ ఇచ్చింది. ఆమె మా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. దీనిపై స్పందించిన కళ్యాణి తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Updated On 26 May 2023 1:31 AM GMT
Ehatv

Ehatv

Next Story