త్రిషపై(Trisha Krishnan) వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళనటుడు. లియో(Leo) మూవీలో నటించిన మన్సూర్(Mansoor) .. ఇదే మూవీలో హీరోయిన్ గా నటించిన త్రిషపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.ఆయన ఏమన్నారంటేు.. నేను నటిస్తున్నట్లు తెలిసినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. త్రిషను నా చేతులతో ఎత్తుకుని బెడ్‌ రూమ్‌లో వేసే సన్నివేశం ఉంటుందని ఊహించుకున్నా. కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanaka Raj) మాత్రం కనీసం త్రిషను చూపించను కూడా చూపించలేదు. ఇప్పటికే నేను చాలా రేప్ సీన్స్ చేశాను. కానీ, ఇది నాకు కొత్తగా ఉంటుంది అనుకున్నా అంటూ మన్సూర్ అలీ ఖాన్ చేసిన అసభ్యకర కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అయితే ఆయనచేసిన ఈ వ్యాఖ్యలపై మొదట హీరోయిన్ త్రిష తీవ్రంగా స్పందించింది. అలాంటి నీచుడితో తన జీవితంలో ఇంకెప్పుడు నటించను అని త్రిష మండిపడింది. దాంతో త్రిష కు ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. చాలా మంది తారలు ఈ విషయంలో స్పందిస్తున్నారు. ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై స్పందించారు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ట్విట్టర్ వేదికగా స్పందించారు లోకేష్ కనకరాజ. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు అని.. అవి విని కోపం ఆపుకోలేకపోతున్నామన్నారు. మేమంతా కలిసి లియో కోసం ఒకే జట్టుగా పనిచేశాము. మహిళలు, తోటి కళాకారులు, నిపుణుల పట్ల గౌరవం అనేది ఏ పరిశ్రమలోనైనా పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను అన్నారు.

ఇక ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. హీరోయిన్ మాళవిక స్పందిస్తూ.. చాలా నీచనంగా, అసహ్యంగా అనిపిస్తోంది.. ఇలా మహిళల గురించి మాట్లాడటం సిగ్గు చేటు.. అయితే ఇంత బహిరంగంగా ఇలా మాట్లాడటం, ఆలోచించడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.. ఇలాంటి సాహసం ఎలా చేయగలిగాడు.. తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించలేదా? ఇతడ్ని చూస్తే సిగ్గేస్తోంది.. అంటూ ట్వీట్ వేసింది.

కాగా లియో సినిమా సూపర్ హిట్ అయ్యింది... ఖైధీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ .... లియో సినిమాలో విజయ్, త్రిషతోపాటు గౌతమ్ మీనన్, మిష్కిన్, అర్జున్ సర్జా, సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇక లియో సినిమా అక్టోబర్ 19న విడుదల అయ్యింది.

Updated On 20 Nov 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story