దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు.. ప్రతీ థియేటర్ హౌస్ ఫుల్ అవుతుండగా.. తాజాగా అంత రష్ లో కూడా సినిమారెస్పాన్స్ ను చూడటానికి వెళ్ళారు.. లోకేష్ నకగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్.

దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు.. ప్రతీ థియేటర్ హౌస్ ఫుల్ అవుతుండగా.. తాజాగా అంత రష్ లో కూడా సినిమారెస్పాన్స్ ను చూడటానికి వెళ్ళారు.. లోకేష్ నకగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్.

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay)నటించిన యాక్షన్ మూవీ లియో. (Leo..Bloody Sweet). త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన ఈసినిమాను లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేశాడు. ఈరోజు ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా. దీంతో థియేటర్‌ల‌ వద్ద ప్రేక్షకుల సందడి నెలకొన్నది. ఇక థియేటర్‌ల‌ ముందు విజయ్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి గట్టిగా చేశారు. సామాన్యులకు ఈరోజు టికెట్లు దొరకడమే కష్టం. ఇక ఇంత రష్ లో సెలబ్రిటీలు థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం సాధ్యం అవుతుందా.. ఎవరైనా ఆ సాహసం చేస్తారా..?

కాని ఆ సాహసం చేశారు లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. త‌మిళనాడులో ఉదయం 9 గంట‌లకు షో స్టార్ట్ అవ్వడంతో అభిమానులు థియేటర్ల‌ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వెట్రి థియేటర్‌కు అభిమానులతో కలిసి లియో సినిమా చూసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, చిత్రబృందం వచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. త‌మిళనాడులో ‘లియో’ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకు అనుమతి ఇవ్వలేమని.. ఉదయం 9 గంటల నుంచే స్క్రీనింగ్‌లకు అనుమతి ఇస్తామంటూ త‌మిళనాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో త‌మిళ‌నాడు మిన‌హా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా సహా ఇతర దేశాల్లో తెల్లవారుజామున 4 గంటలకు లియో విడుదలైంది.

Updated On 20 Oct 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story