మాడు పగలగొడుతున్న ఎండల ధాటికి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఎలాగు తప్పదు. ఇంటిపట్టున ఉన్నవారు కూడా అత్యవసరం ఉంటే తప్ప కాలు బయట పెట్టడం లేదు.
మాడు పగలగొడుతున్న ఎండల ధాటికి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఎలాగు తప్పదు. ఇంటిపట్టున ఉన్నవారు కూడా అత్యవసరం ఉంటే తప్ప కాలు బయట పెట్టడం లేదు. మరి వారికి టైమ్‌పాస్ అవ్వాలిగా! కాలక్షేపం ఓటీటీలు ఉన్నాయి. ఈ వారం బోల్డన్నీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో లవ్‌మీ, లవ్ మౌళి వంటి చిన్న సినిమాలు ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా వాయిదా పడ్డాయి. విశాల్ కథానాయకుడిగా నటించిన రత్నం సినిమా మాత్రం థియేటర్లలో వస్తున్నది. ఈ వారం ఓటీటీల్లో 17 వరకు సినిమాలు- సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అన్ని గొప్ప సినిమాలు అని చెప్పలేం కానీ, ఓ నాలుగైదు సినిమాలైతే చూడబుల్‌గా ఉన్నాయి. ఇవి కాకుండా సడన్‌గా రిలీజ్ అవుతాయేమో అనేది చూడాలి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా టిల్లు స్క్వైర్ మాత్రమే.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (ఏప్రిల్ 22-28 వరకు)
నెట్‌ఫ్లిక్స్(Netflix)
బ్రిగంటి (ఇటాలియన్ సిరీస్) - ఏప్రిల్ 23
ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్) - ఏప్రిల్ 23
డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్) - ఏప్రిల్ 24
సిటీ హంటర్ (జపనీస్ సినిమా) - ఏప్రిల్ 25
డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25
టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26
గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26
ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్(Amazon prime)
దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25
హాట్‌స్టార్
భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25
థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 26
క్రాక్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 26
జియో సినిమా(Jio Cinema)
ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 22
వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27
బుక్ మై షో(Book my show)
కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26
ఆపిల్ ప్లస్ టీవీ
ద బిగ్ డోర్ ప్రైజ్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26