సినీ నిర్మాతలు లింగుసామి, సుభాష్ చంద్రబోస్ నిర్మాతల మండలిలో కమల్ హాసన్‌పై ఫిర్యాదు చేశారు.

సినీ నిర్మాతలు లింగుసామి, సుభాష్ చంద్రబోస్ నిర్మాతల మండలిలో కమల్ హాసన్‌పై ఫిర్యాదు చేశారు. 2015లో వచ్చిన ఉత్తమ విలన్ చిత్రం కోసం ఈ ముగ్గురూ కలిసి పనిచేశారు. తిరుపతి బ్రదర్స్‌ పేరిట ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా ఉన్నారు. అయితే ఈ సినిమా కారణంగా అప్పుల్లోకి వెళ్లినట్లు నిర్మాతలు చెప్పుకొచ్చారు. కమల్ కాంట్రాక్టును ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు.

ఉత్తమ విలన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన తర్వాత, ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి ₹ 30 కోట్ల బడ్జెట్‌తో మరో చిత్రంలో పని చేస్తానని కమల్ హాసన్ వాగ్దానం చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుసామి పేర్కొన్నారు. కమల్ స్క్రిప్ట్‌ను చాలాసార్లు మార్చారని, బాక్సాఫీస్ వైఫల్యానికి అదే కారణమని లింగుసామి వివరించాడు. దృశ్యం రీమేక్ కోసం వారు తనను సంప్రదించారని, అయితే తాను వేరే నిర్మాతతో సినిమా చేశానని కూడా లింగుసామి పేర్కొన్నాడు. మొదట, వేలు నాయకర్ (మణిరత్నం 1987లో నాయకన్‌లో కమల్ పాత్ర) వంటి వ్యక్తి తన సోదరుడిని గూండాల నుండి రక్షించే సూపర్ కమర్షియల్ సినిమా చేస్తానని చెప్పారు. కమల్ సోదరుడిగా ఆ సినిమాలో సిద్ధార్థ్ నటించాల్సి ఉంది.. కానీ కమల్ సమస్య ఏమిటంటే, ఆయన తరచుగా తన నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. నేను దర్శకుడిగా ఉండి ఉంటే అది వేరే విషయం, కానీ నేను నిర్మాతగా ఉన్నానని అదే పెద్ద సమస్య అయిందని లింగు సామి చెప్పుకొచ్చారు. 'ఉత్తమ విలన్' సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్‌ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు.

Updated On 4 May 2024 1:03 AM GMT
Yagnik

Yagnik

Next Story