నయనతార (Nayanthara) భర్త విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఎల్‌ఐసీ’ (లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) (LIC). ఈ సినిమా టైటిల్‌ విషయంలో విఘ్నేశ్‌ శివన్‌కు సమస్యలు వస్తున్నాయి. ఎల్‌ఐసీ సంస్థ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. సినిమా కోసం ఈ టైటిల్‌ను ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. వారం రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సమంత, నయనతార కాంబినేషన్ లో రూపొందిన ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’ తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ప్రదీప్‌ రంగనాథన్‌ , కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌లో ఇది పట్టాలెక్కింది. పూజా కార్యక్రమం అనంతరం టైటిల్‌ను అనౌన్స్ చేయగా.. తమిళ దర్శకుడు, సంగీత దర్శకుడు కుమారన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితమే తాను ‘ఎల్‌ఐసీ’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకున్నానని, ఆ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయన్నారు. టైటిల్‌ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పుడీ సమస్య వచ్చింది.

ఇక ‘లవ్ టుడే’ తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ . ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. లో బడ్జెట్‌లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రదీప్ నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫలితంగా ప్రదీప్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతర దర్శకులు కూడా తమ చిత్రాల్లో నటించాలని ఆయనను అడుగుతున్నారు.

Updated On 7 Jan 2024 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story