వాళ కోలీవుడ్ హీరో దళపతి విజయ్(thalapathy vijay) బర్త్‌డే.. ఫ్యాన్స్ అంతా తమ హీరో పుట్టిన రోజు వేడుకలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా లియో(LEO).. దీనికి లోకేశ్ కనగరాజ్(Lokesh kanakaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను లాంఛ్ చేశారు.

Thalapathy Vijay Birthday
ఇవాళ కోలీవుడ్ హీరో దళపతి విజయ్(thalapathy vijay) బర్త్‌డే.. ఫ్యాన్స్ అంతా తమ హీరో పుట్టిన రోజు వేడుకలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా లియో(LEO).. దీనికి లోకేశ్ కనగరాజ్(Lokesh kanakaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ పాట యూట్యూడ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడు విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇవాళ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా లియో ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster) లాంచ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. లియో సినిమాలో విజయ్‌కు జోడిగా త్రిష నటిస్తున్నారు.
ఇప్పటికే లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. లియో చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు రాస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై భారీ అంచనాలు ఉన్నాయి.
