భక్త కన్నప్ప(Bhakta Kannappa) సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హీరో మంచు విష్ణు(Manchu Vishnu) ఆ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఏ మాత్రం రాజీ పడటం లేదు. పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. అపార అనుభవం ఉన్న టెక్నిషియన్లకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే విష్ణు సినిమాను అనౌన్స్‌ చేసినప్పట్నుంచే అంచనాలు పెరిగాయి.

భక్త కన్నప్ప(Bhakta Kannappa) సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హీరో మంచు విష్ణు(Manchu Vishnu) ఆ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఏ మాత్రం రాజీ పడటం లేదు. పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. అపార అనుభవం ఉన్న టెక్నిషియన్లకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే విష్ణు సినిమాను అనౌన్స్‌ చేసినప్పట్నుంచే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కీలకమైన శివుడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. పార్వతి దేవి పాత్రలో నయనతార(Nayanthara) కనిపించబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఇందులో నిజమెంతో తెలియదు. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్టులోకి మరో స్టార్‌ హీరో వచ్చారు.మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్లాల్(Mohanlal) కూడా కన్నప్పలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఇటీవల మంచు విష్ణు మోహన్‌లాల్‌ను కలిశారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహాభారత సిరీస్‌ను బుల్లితెరకు ఎక్కించిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Updated On 30 Sep 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story