దిగ్గజ దర్శకులు... కళా తపస్వి బిరుదాంకితులు కె. విశ్వనాథ్ గారు ఇకలేరు.. యావత్ సినీ జగత్తును శోక సంద్రంలో ముంచేసి ఆ విశ్వనాథుని చెంతకు చేరారు.. అద్భుత కళాకంఢాలను భారతీయ సినీ ప్రియులకు కానుకగా అందించి ప్రతి ఒక్కరి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయారు.. కె. విశ్వనాథ్ గారి తెరకెక్కించిన ప్రతి చిత్రం ఓ కలికితురాయి.. సినీ దర్శకులకు.. నటులకు ఓ భగవత్‌గీతలాంటిది.. అని చెప్పడం అతిశయోక్తి కాదు.. కళలకు జీవం పోయడం.. సామాజిక రుగ్మతలను కథావస్తువులుగా తీసుకోవడం.. […]

దిగ్గజ దర్శకులు... కళా తపస్వి బిరుదాంకితులు కె. విశ్వనాథ్ గారు ఇకలేరు.. యావత్ సినీ జగత్తును శోక సంద్రంలో ముంచేసి ఆ విశ్వనాథుని చెంతకు చేరారు.. అద్భుత కళాకంఢాలను భారతీయ సినీ ప్రియులకు కానుకగా అందించి ప్రతి ఒక్కరి హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయారు..

కె. విశ్వనాథ్ గారి తెరకెక్కించిన ప్రతి చిత్రం ఓ కలికితురాయి.. సినీ దర్శకులకు.. నటులకు ఓ భగవత్‌గీతలాంటిది.. అని చెప్పడం అతిశయోక్తి కాదు.. కళలకు జీవం పోయడం.. సామాజిక రుగ్మతలను కథావస్తువులుగా తీసుకోవడం.. సంగీత, సాహిత్యాలతో అత్యద్భుత చిత్రాలను తెరకెక్కించడం ఒక్క విశ్వనాథునికే సాధ్యమేమో అనిపించేలా ఉంటాయి ఆయన చిత్రాలు.. చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన... ఆయన 'ఆత్మ గౌరవం'తో దర్శకునిగా మారారు..

కమర్షియల్ హోరులో సినీ పరిశ్రమ పరుగులు పెడుతున్న దశకంలో కేవలం సంగీతమే ప్రధానాంశంగా 'శంకరాభరణం' తెరకెక్కించి.. చరిత్ర సృష్టించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవాన్ని తెచ్చారు. అవార్డులు..రివార్డులు అందుకుని యావత్ భారత సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన 'సప్తపది' 'స్వాతిముత్యం' 'స్వయంకృషి' 'శుభోదయం' 'శుభలేఖ', 'ఆపద్బాంధవుడు' 'శుభసంకల్పం' సినిమాల గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు.. ఆయన చిత్రాలలోని మాటలు పాటలు తప్ప సామాన్యుల నోటి నుండి వచ్చే పదాలు సరిపోవు..

భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ 'సాగరసంగమం' అన్నారు.. ఆ కళాతపస్వి.. ఆ హోరులో ఊగిపోయామంతా... కాలి అందియల సవ్వడిలో చిందులేశామంతా..
ఇక 'స్వరాభిషేకం' 'శృతిలయలు' సిరివెన్నెల' 'స్వర్ణకమలం' 'స్వాతికిరణం'తో పండిత, పామరుల నోట కూడా ఆయన పాటలే.. ఆయన మాటలే... ఆయన సినీ ప్రస్థానంలో... రఘుపతి వెంకయ్య అవార్డు.. పద్మశ్రీ.. దాదా సాహెహ్ పాల్కే అవార్డు.. జాతీయ పురస్కారాలు.. నంది అవార్డులు... ప్రఖ్యాత ఆస్కార్ 59వ అవార్డుల బరిలో స్వాతి ముత్యం చిత్రం.. ఒదిగిపోయాయి.. చరిత్రలో నిలిచిపోయాయి... ఆ స్ఫూర్తి ప్రధాత ఇకపై భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు.. కానీ రానున్న తరాలకు ఓ సినీ గ్రంథాలయంగా.. దర్శక దిగ్గజంగా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.. ఆలోచింపజేస్తారు... అలరిస్తారు.. సంగీతపు హోరులో ముంచెత్తుతారు..

Updated On 3 Feb 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story