మెగా హీరో వరణ్‌తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌ మణికొండ(Manikonda)లోని నాగబాబు(Naga Babu) నివాసంలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన ఓ ఫోటోను తాజాగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు లావణ్య త్రిపాఠి. తన ఎంగేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు

మెగా హీరో వరణ్‌తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌ మణికొండ(Manikonda)లోని నాగబాబు(Naga Babu) నివాసంలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన ఓ ఫోటోను తాజాగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు లావణ్య త్రిపాఠి. తన ఎంగేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుణ్‌తేజ్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశారామె! వరుణ్‌ కూడా అదే ఫోటోను ఓకే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఆ ఫోటోలో వరుణ్‌తేజ్‌ చేయి పట్టుకుని చిరునవ్వుతూ కనిపించారు లావణ్య. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్‌ తెగ సంతోషపడుతున్నారు. కాబోయే వధూవరులకు విషెస్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. 2017లో వచ్చిన మిస్టర్‌ అనే సినిమాలో మొదటిసారి వరుణ్‌-లావణ్య కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంటే 2018లో వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమాలో నటించారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం వీరు బయటకు చెప్పలేదు. మీడియా, సోషల్‌ మీడియాలో వీరిద్దరి గురించి కథనాలు వచ్చినా ఎవరూ స్పందించలేదు. చివరకు ఎంగేజ్‌మెంట్‌తో ప్రేమ విషయాన్ని బయటకు చెప్పారు. ఈ ఏడాది చివరన పెళ్లి జరిగే అవకాశం ఉంది. వీరి పెళ్లి ఇటలీలో జరుగబోతున్నదట. ఇదిలా ఉంటే, ఇంకో ఇంట్రెస్టింగ్‌ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్లికి ముందే వరుణ్‌కు ఓ కండీషన్ పెట్టారట లావణ్య. ఆ కండిషన్‌కు ఓకే చెబితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ఆ కండీషన్‌ ఏమిటంటే లావణ్యకు భరతనాట్యం అంటే చాలా చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత కూడా నాట్యం చేయాలన్నది ఆమె కోరిక. ఈ విషయాన్ని వరుణ్‌కు చెప్పారట. పెళ్లి తర్వాత ఏదైనా వేదిక మీద భరతనాట్యం చేసే అవకాశం వస్తే మాత్రం కాదనకూడదని వరుణ్‌కు చెప్పారట. పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పనున్న లావణ్య తర్వాత ప్రొడక్షన్స్‌ వైపు వెళ్లాలని అనుకుంటున్నారు. లావణ్య పెట్టిన ఈ షరతులకు వరుణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఓకే చెప్పేసింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.

Updated On 14 Jun 2023 4:02 AM GMT
Ehatv

Ehatv

Next Story