టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠీలు(Lavanya tripathi) పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి పెళ్లి గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఫ్యామిలీ. ఇటలీలోని(Italy) టస్కనీలో(Tuscany) వీరు డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) చేసుకోనున్నారు.

Varun-Lavanya Went To Italy
టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠీలు(Lavanya tripathi) పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి పెళ్లి గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఫ్యామిలీ. ఇటలీలోని(Italy) టస్కనీలో(Tuscany) వీరు డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అక్టోబర్ 30న మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి.
ఇక మెగా ఫ్యామిలీలో అప్పుడే సందడి స్టార్ట్ అయ్యింది. పెళ్లి కోసం ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వరుణ్, లావణ్యలు ఇటలీకి బయల్దేరారు. వీరితో పాటు వైష్ణవ్ తేజ్(Vaishnav tej) కూడా వెళ్లాడు. మరోవైపు నవంబర్ 5న మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరో నాలుగు రోజుల్లో ఒక్కటి కాబోతున్నారు. ఐదేళ్ల ప్రేమకి పెళ్లిబంధంతో శుభంకార్డ్ వేయబోతున్నారు. 'మిస్టర్' చిత్రంతో ప్రారంభమైన ఈ జంట ప్రేమ కథ ఎట్టకేలకు శుభం కార్డ్ పడబోతుంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీ బయలు దేరారు. అక్కడ గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు.
తాజాగా ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిందీ జంట. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మొదటగా ఇటలీ బయలు దేరడం విశేషం. ఈ సందర్భంగా లావణ్య ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఎయిర్ పోర్ట్ లో తను చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆమె కారు నుంచి దిగాక అక్కడ ఉన్న వ్యక్తికి టిప్పు కూడా ఇచ్చింది. దీంతో అతను ఆనందంలో మునిగిపోయారు. ఆయన ముఖంలో ఆనందం చూసిన లావణ్య సైతం చిరు నవ్వుతో అక్కడి నుంచి బయలు దేరింది. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
