రాజ్ తరుణ్‌, లావణ్యల వ్య‌వ‌హారం డైలీ సీరియ‌ల్‌లా న‌డుస్తుంది. ఓ ప‌క్క ఆ ఎపిసోడ్ న‌డుస్తుండ‌గా..

రాజ్ తరుణ్‌(RajTharun), లావణ్య(Lavanya)ల వ్య‌వ‌హారం డైలీ సీరియ‌ల్‌లా న‌డుస్తుంది. ఓ ప‌క్క ఆ ఎపిసోడ్ న‌డుస్తుండ‌గా.. తాజాగా లావణ్య ఓ టీవి ఛాన‌ల్ డిబేట్‌కు హాజ‌ర‌య్యింది. అదే ఛాన‌ల్‌కు రాజ్ తరుణ్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడే.. ఆర్‌జే శేఖర్ బాషా(RJShekarBasha) కూడా వ‌చ్చాడు. గ‌తంలో ఆర్‌జే శేఖర్ బాషా.. లావణ్యపై డ్రగ్స్(Drugs) సహా అనేక ఆరోపణలు చేయ‌డ‌మే కాక‌.. కాల్ రికార్డింగ్స్ కూడా బయటపెట్టాడు. ఇదిలావుంటే.. డిబేట్ న‌డుస్తుండ‌గా.. శేఖర్ ఆరోపణలకు గ‌ట్టిగా రియాక్టైన‌ లావణ్య లైవ్‌లోనే అత‌డిని చెప్పుతో కొట్టింది.

శేఖర్ బాషా లైవ్ డిబేట్‌లో మాట్లాడుతూ.. చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్లని ఈ దందాలోకి లాగుతూ వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తున్న లావణ్య లాంటి మనుషుల్ని వదలకూడదని అని అన్నాడు.

పక్కనే ఉన్న లావణ్య ఆ మాటలు పూర్తి కాకముందే.. తన చెప్పు తీసి శేఖర్ బాషాను బలంగా కొట్టింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సీరియ‌స్ అయ్యింది. శేఖర్ కూడా లావణ్య పైకి వెళ్లాడు. కొట్టూ దమ్ముంటే కొట్టూ అంటూ రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప‌క్క‌నే ఉన్న యాంక‌ర్ వారించ‌డంతో ఇరువురు త‌మ సీట్ల‌లో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.



Sreedhar Rao

Sreedhar Rao

Next Story