హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య (Lavanya)వివాదం టెలివిజన్ సీరియల్‌లా సాగుతూనే ఉంది.
హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య (Lavanya)వివాదం టెలివిజన్ సీరియల్‌లా సాగుతూనే ఉంది. రాజ్‌తరుణ్‌తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రా( Heroine Malvi Malhotra)తో కలిసి ఉంటున్నాడని చెబుతూ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌తరుణ్‌కు నోటీసులు కూడా పంపించారు. ఇదిలా ఉంటే రాజ్‌తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి(Tiragabadara Samy)సినిమా ఆగస్టు 2వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్(PrasadLab)లో ప్రీ రిలీజ్‌వేడుకను నిర్వహించారు మేకర్స్. ఇందులో పాల్గొన్న రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు చేసేవాళ్లు మాత్రమే ప్రతిసారీ బయటకు వచ్చి మాట్లాడతారని, తాను ఆరోపణలు చేయడం లేదని, ప్రతి దానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని రాజ్ తరుణ్ తెలిపాడు. లీగల్‌గా ముందుకు వెళతానని, భయపడాల్సిన అవసరం తనకు లేదన్నాడు. కచ్చితంగా న్యాయపరంగా దీనిపై చర్యలు తీసుకుంటానని, తన దగ్గర అన్నిరకాల సాక్ష్యాధారాలున్నాయని రాజ్‌తరుణ్ అన్నాడు. మీడియా ముందుకువచ్చి లావణ్య ఆరోపణలు చేసినప్పుడు.. సాక్ష్యాలు చూపించమని ఎవరూ అడగలేదని, ఏదైనా అంటే కోర్టులో చూపిస్తామని ఆమె చెబుతుందని రాజ్‌తరుణ్ చెప్పుకొచ్చడు. 'దయచేసి, ఈ వేడుకలో ఆ టాపిక్ గురించి మాట్లాడవద్దు. ఆమె నా గురించి ఆరోపణలు చేసిన రోజే నేను మీడియాతో మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దానిలో ఏ అబద్ధం లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. నేనింకా వాటిని బయటపెట్టలేదు. ఎఫ్‌ఐఆర్(FIR)లో అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు? నేను తప్పించుకుని తిరగలేదు. నాకు నోటీసులు ఇచ్చారు. రెస్పాండ్ అయ్యా. ఈ టాపిక్‌పై ఇక నేను మాట్లాడాలనుకోవడం లేదు' అని రాజ్‌తరుణ్ వివరించాడు. ఆరోపణలను ఎదుర్కొంటున్న మాల్వీ మల్హోత్ర కూడా వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. 'నాతో పాటు నా సోదరుడిపై లావణ్య ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడాను. జులై 24న ఆమె నాకు మెసేజ్ పంపింది. దానిని కూడా పోలీసులకు అందించాను. దానిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. మేము ఏమీ తప్పు చేయలేదు. మా కుటుంబానికి ఆమె ఎవరో తెలియదు. ఆమెను మేము చూడలేదు కూడా. ఎందుకు ఆమె ఇలా చేస్తున్నారో తెలియదు. 2020లో నన్ను కొట్టి ఇబ్బందిపెట్టిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్నారు. ఒక అమ్మాయిగా.. వాళ్లతో టచ్‌లో ఉండొద్దని ఆమెకు సలహా ఇచ్చా. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్' అని మాల్వీ మల్హోత్రా అన్నారు.