నటుడు రాజ్‌తరుణ్(Raj tharun), లావణ్య చౌదరి(Lavanya choudhary) కేసులో మరో ట్విస్టు.
నటుడు రాజ్‌తరుణ్(Raj tharun), లావణ్య చౌదరి(Lavanya choudhary) కేసులో మరో ట్విస్టు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదయ్యింది. ఏ 1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వి మల్హోత్రా(Malvi malhotra), ఏ 3గా మయాంక్ మల్హోత్రాను(Mayank Malhotra) పోలీసులు చేర్చారు. 2008 నుంచి రాజ్‌తరుణ్‌కు లావణ్య పరిచయం ఉంది. 2010లో లావణ్యకు రాజ్‌తరుణ్ ప్రపోజ్ చేశాడట! 2014లో తనను రాజ్‌తరుణ్ పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెబుతోంది. తమ కుటుంబం రాజ్‌తరుణ్‌ను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపింది. రాజ్‌తరుణ్‌కు ఉన్న ఆర్ధిక సమస్యలన్నింటినీ తమ కుటుంబం భరించిందని, ఇప్పటి వరకు రాజ్‌తరుణ్‌కు 70 లక్షల రూపాయలు ఇచ్చామని లావణ్య పేర్కొంది. రాజ్‌తరుణ్ కుక్కల కారణంగా ఆరు సంవత్సరాలలో ఆరు ఇండ్లు మార్చాల్సి వచ్చిందని తెలిపింది. 2016లో తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని, రెండు నెలలప్పుడు బలవంతంగా అబార్షన్(abortion) చేయించారని ఆరోపించింది లావణ్య. హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణే చెల్లించాడని పేర్కొంది. అమెరికా నుంచి తాను జనవరిలో తిరిగి వచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారని, తనపై తప్పుడు డ్రగ్స్ కేసు పెట్టారని తర్వాత తెలిసిందని లావణ్య అన్నారు. రాజ్‌తరుణ్ కుట్ర కారణంగా తాను 45 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని వాపోయారు. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాలు తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు లావణ్య. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. తనను చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వితోపాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.