ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) నుంచి రాబోతున్న సినిమాల్లో లాల్ సలామ్(Lal Salam) మూవీ ఒకటి. రజినీకాంత్ డాన్ పాత్రలో కనిపించబోతున్న ఈసినిమాలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అతిథిపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈసంక్రాంతికి రిలీజ్ కావల్సిన ఈసినిమా పొంగల్ వార్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈమూవీ నుంచి తాజాగా అదిరిపోయ అప్ డేట్ అందించారు మూవీ టీమ్.

కపిల్ దేవ్(Kapil dev) పుట్టినరోజు(Birthday) సందర్భంగా లాల్ సలామ్ మూవీ టీమ్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ముంబయి శివాజీ పార్క్ మైదానంలో రజనీకాంత్, కపిల్ దేవ్ నడుస్తూ మాట్లాడుకుంటున్న పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో రజినీకాంత్.. కపిల్ దేవ్ తో నవ్వుతూ మాట్లాడటం కనిపిస్తోంది. ఇక ఈ పోస్ట్ కు ఓ నోట్ కూడా రాశారు టీమ్.

"లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కు లాల్ సలామ్ టీమ్ హ్యాపీ బర్త్ డే చెబుతోంది. మీరు సాధించిన విజయాలు, మీ నాయకత్వం, మీ ప్రస్థానం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ ఏడాది మీకు ఆనందోత్సాహాలతో, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని కోరుకుంటున్నాం" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది.

భారీ బట్జెట్ తో.. భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న లాల్ సలామ్ సినిమాను రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీలో తమిళ యంగ్ స్టార్స్.. విష్ణువిశాల్, విక్రాంత్, సెంథిల్, జీవితా రాజశేఖర్, తంబి రామయ్య, అనంతిక సనిల్ కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై తదితరులు నటిస్తున్నారు.

Updated On 7 Jan 2024 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story