సినిమాలు చేయకపోయినా.. ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ చేరిన ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా తన హోమ్ టూర్ వీడియోతో సందడి చేసింది. ఇటు సినిమాలు .. అటు సమాజసేవ.. మరోవైపు సోషల్ మీడియా.. ఇలా వరుస టాస్క్ లతో బిజీ బిజీగా ఉంది మంచు లక్ష్మి. ఒక రకంగా చెప్పాలంటే.. సినిమాలకు ప్రస్తుతం కొంచెం దూరంగానే ఉంది మంచు. మరిఅవకావాలు రావడంలేదా.. లేక తానే దూరంగా […]

సినిమాలు చేయకపోయినా.. ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. టాలీవుడ్ ను వదిలి బాలీవుడ్ చేరిన ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా తన హోమ్ టూర్ వీడియోతో సందడి చేసింది.

ఇటు సినిమాలు .. అటు సమాజసేవ.. మరోవైపు సోషల్ మీడియా.. ఇలా వరుస టాస్క్ లతో బిజీ బిజీగా ఉంది మంచు లక్ష్మి. ఒక రకంగా చెప్పాలంటే.. సినిమాలకు ప్రస్తుతం కొంచెం దూరంగానే ఉంది మంచు. మరిఅవకావాలు రావడంలేదా.. లేక తానే దూరంగా ఉందా తెలియదు కాని.. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా రకరకాల వేశాలు వేసి ప్రస్తుతం ఖాళీగా ఉంది మంచు లక్ష్మి. అయితే టాలీవుడ్ తో వర్కౌట్ అవ్వడం లేదని.. అనుకుందో లేక బాలీవుడ్ పై ఆశ పుట్టుకొచ్చిందో తెలియదు కాని.. తాజాగా ముంబయ్ కి మకాం మర్చేసింది మంచు లక్ష్మి.

ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది మంచు లక్ష్మి. అక్కడ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయట. అంతే కాదు ఆమెకు ఎక్కువగా సర్కల్ కూడా అక్కడే ఏర్పడిందని..ఊరికే ఏదో ఒక పని మీద ముంబయ్ వెళ్ళి.. ఎక్కువ రోజులు హోటల్స్ లో ఉండటం ఇబ్బందిగా ఉందట. అందకే ఏకంగా కొన్ని నెలల క్రితమే ఆమె ముంబైకు షిఫ్ట్‌ అయ్యింది. ఇక మంచు లక్ష్మికి య్యూట్యూబ్ ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే తనహైదరాబాద్ ఇంటితో పాటు.. ఊరి చివరన ఉన్న మోహన్ బాబు ఇంటిని కూడా హోమ్ టూర్ చేసింది మంచు. ఇక తాజాగా ముంబయ్ లో ఉన్న తన ఇల్లు చూపిస్తూ.. ఓ వీడియోను తన ఛానెల్ లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి.

తన ఇంటి విశేషాలను చెబుతూ హోం టూర్‌ నిర్వహించిందామె. కొన్ని రోజుల క్రితమే నేను ముంబైకి షిప్ట్‌ అయ్యాను. నా అభిరుచులకు తగినట్టుగా నాకు నచ్చిన ఇంటి కోసం సుమారు వారం రోజుల పాటు 28 ఫ్లాట్స్‌ చూశా. చివరకు నాకు బాగా నచ్చిన ఈ ఫ్లాట్ ను సెలక్ట్ చేశాను. అన్నారు. అంతే కాదు. ఈ ఇంటికోసం ఎక్కువ మెటీరియల్ అంతా హైదరాబాద్‌లోని నా ఇంటి నుంచి తీసుకొచ్చినవే. అందులో కొన్నింటిని రీ మోడలింగ్‌ చేయించాను అన్నారు మంచు లక్ష్మి.

ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే తనకిష్టమైన గణేశుడి పెయింటింగ్ కనిపిస్తుంది అది ఒక అమెరికన్ ఫ్రెండ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. మా అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ కృష్ణుడి పెయింటింగ్‌ ఏర్పాటు చేశాను అంటూ తన ఇంటి గురించి వివరించిన వీడియో వైరల్ అవుతోంది. అంతే కాదు తనకు మొక్కలంటే చాలా ఇష్టం కావడంతో... ముంబయ్ కు దగ్గరలో ఉన్న పుణే నగరం నుంచి ప్రత్యేకమైన మొక్కలు పెట్టానని చూపించారు మంచు. ఇక మంచు లక్ష్మి ముంబయ్ లో ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇక మంచు లక్ష్మి సినిమాలతో పాటు సమాజ సేవ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్ ను ను దత్తత తీసుకుని..ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా వాటిని తయారు చేస్తుంది. క్వాలిటీ ఎడ్యూకేషన్ వారికి అందించాలని పాటుపడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ప్రభుత్వ స్కూల్స్ ను ఆమె దత్తత తీసుకున్నారు. టైమ్ దొరికినప్పుడల్లా ఆస్కూల్స్ ను సందర్శిస్తూ.. వారితో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంది మంచు .

Updated On 9 Jan 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story