కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan babu) నట వారసురాలిగా ఆయన కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi) సినిమాల్లో అడుగుపెట్టారు. సినిమాలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి తనకు నచ్చిన, నచ్చని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. సమకాలిన పరిస్థితులపై కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆమె పట్ల నెటిజన్లు నెగటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. మంచు లక్ష్మి మంచి చెప్పినా కొందరు మాత్రం అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. కొన్ని కామెంట్లను లైట్ తీసుకుంటారు
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan babu) నట వారసురాలిగా ఆయన కూతురు మంచు లక్ష్మి(Manchu Lakshmi) సినిమాల్లో అడుగుపెట్టారు. సినిమాలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి తనకు నచ్చిన, నచ్చని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. సమకాలిన పరిస్థితులపై కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆమె పట్ల నెటిజన్లు నెగటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. మంచు లక్ష్మి మంచి చెప్పినా కొందరు మాత్రం అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. కొన్ని కామెంట్లను లైట్ తీసుకుంటారు. కొన్నింటికి కౌంటర్లు ఇస్తుంటారు. లేటెస్ట్‌గా మంచు లక్ష్మికి అలాంటి ఘటనే ఎదురయ్యింది. ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబాయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని చూశారు. తర్వత ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా(Air India) విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్‌లు శుభ్రంగా లేవని చెబితే సిబ్బంది నవ్వి ఊరుకున్నారన్నది ఆ ట్వీట్ సారాంశం. పరిశుభ్రత అనేది ప్రయాణికుల హక్కు అని ఆమె తెలిపారు. తన ఐఫోన్ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనపడేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. అందుకు గాను ఎయిర్ ఇండియా కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. కొందరు నెటిజన్లు మాత్రం మంచు లక్ష్మిపై ఇష్టంవచ్చినట్టుగా కామెంట్లు చేశారు. ఓహో.. నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దానికి మంచు లక్ష్మి బాగానే జవాబిచ్చారు. ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటిరా? నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏదీ చేయకూడదు. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి..? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతాను. మాకు ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు.డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశాను. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగాను. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశాను. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అంటూ మంచు లక్ష్మి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.