కమల్ హాసన్(Kamal Hassan), నయనతార(Nayanthara) వీరిద్దరి కాంబినేషన్ లో ఇంత వరకూ సినిమా రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ హీరోలందరితో నటించింది నయన్. కాని తమిళంలో కమల్ తో నటించే అవకాశం ఆమెకు రాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో కూడా సినిమాలు చేసిన నయన్..

Nayanthara-Kamal Hassan
కమల్ హాసన్(Kamal Hassan), నయనతార(Nayanthara) వీరిద్దరి కాంబినేషన్ లో ఇంత వరకూ సినిమా రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ హీరోలందరితో నటించింది నయన్. కాని తమిళంలో కమల్ తో నటించే అవకాశం ఆమెకు రాలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో కూడా సినిమాలు చేసిన నయన్.. కమల్ తో మాత్రం జతకట్టే అవకాశం రాలేదు. ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.
కమల్ హాసన్.. మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో ఓసినిమా చేయబోతున్నారు. ఈమూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గతంలో కమల్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన నాయకుడు(Nayakudu) ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. ఇద్దరి కెరీర్లో ఆ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాబోతుంది అంటే అందరిలోనూ ఆసక్తిని పెంచింది.
ప్రస్తుతం కల్కీ(Kalki) సినిమాలో ప్రభాస్ విలన్ గా నటిస్తున్నాడు కమల్ హాసన్. ఈ మూవీ తరువాత మణిరత్నంతో కమల్ సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్ లో 234వ సినిమాగా రూపొందబోతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముందుగా ఈసినిమాకు త్రిష హీరోయిన్ గా అనుకున్నారు. కాని ఎందుకో మళ్ళి త్రిషను కాదని.. నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నారట.
తమిళంలో దాదాపు అందరి స్టార్ హీరోలతో నయన్ నటించింది. కానీ కమల్ హాసన్ కి జోడిగా ఆమె చేయలేదు. త్వరలోనే ఈ రేర్ కాంబో కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం
