హిట్ కొట్టిన సినిమాల గురించి అందరూ రాస్తారు. నాలుగు మెచ్చుకోలు మాటలు కూడా చెబుతారు. మరి దారుణాతిదారుణంగా దెబ్బతిన్ని సినిమా గురించి కూడా చెప్పుకోవాలి కదా! 2023లో సినిమా ఇండస్ట్రీకి కొన్ని సూపర్‌హిట్లు పడ్డాయి. కొన్ని వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. మరి 2023లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్న సినిమా ఏమై ఉంటుందన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది.

Disaster Movie 2023
హిట్ కొట్టిన సినిమాల గురించి అందరూ రాస్తారు. నాలుగు మెచ్చుకోలు మాటలు కూడా చెబుతారు. మరి దారుణాతిదారుణంగా దెబ్బతిన్ని సినిమా గురించి కూడా చెప్పుకోవాలి కదా! 2023లో సినిమా ఇండస్ట్రీకి కొన్ని సూపర్‌హిట్లు పడ్డాయి. కొన్ని వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా వసూలు చేశాయి. మరి 2023లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్న సినిమా ఏమై ఉంటుందన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. అందరూ అనుకునేట్టుగా కంగాన రనౌత్(Kangana Ranuath) నటించిన చంద్రముఖి-2(Chandhramukhi 2) సినిమానా? లేక ఆమెనే హీరోయిన్ వేషం కట్టిన తేజస్ చిత్రమా? ఇవి కాకపోతే డార్లింగ్ ప్రభాస్(Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్(Adipurush) అయి ఉంటుందా? ఇవేవీ కాదు.. సూపర్ డూపర్ డిజాస్టర్‌గా నిలిచిన ఆ సినిమా పేరు లేడి కిల్లర్(Lady Killer). విన్నట్టుగా లేదు కదా! ఎలా వింటారు? ఇలా వచ్చి అలా వెళ్లిపోయినా ఆ సినిమా చాలా మంది తెలియదు కూడా తెలియదు. అలాగని అందులో నటించింది సాదాసీదా యాక్టర్లు కాదు. దాదాపు 45 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఎంత వసూలు చేసిందనుకున్నారు? జస్ట్ లక్ష రూపాయలు మాత్రమే! హాశ్చర్యపోకండి.. నిజమే! అర్జున్ కపూర్(Arjun kapoor), భూమి పెడ్నేకర్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన లేడి కిల్లర్ సినిమాను తీసింది టీ-సీరిస్ వాళ్లు..ఐఎండీబీ 2023లో అతి తక్కువ రేటింగ్ వచ్చిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. నవంబర్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమాకు అజయ్ బెహల్ దర్శకత్వం వహించాడు. కేవలం 12 షోలలతోనే సినిమా విడుదలయ్యింది. మొదటి రోజున కేవలం 38 వేల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా లక్షరూపాయల లైఫ్ టైమ్ వసూళ్లతో పత్తా లేకుండా పోయింది. జీవితం మీద విరక్తి కలగాలని అనుకుంటున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఉంది.. చూడొచ్చు..!
