విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), సమంత(Samantha) హీరో హీరోయిన్లుగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌ సినిమా ఖుషి(Kushi). దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ, సమంత జోడి సినిమాకు మంచి ప్లస్‌ అవ్వడమే కాకుండా ఇందులో పాటలు కూడా జనరంజకం అయ్యాయి.

విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda), సమంత(Samantha) హీరో హీరోయిన్లుగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ట్రైనర్‌ సినిమా ఖుషి(Kushi). దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ, సమంత జోడి సినిమాకు మంచి ప్లస్‌ అవ్వడమే కాకుండా ఇందులో పాటలు కూడా జనరంజకం అయ్యాయి. సినిమా బాగుందనే టాక్‌ వచ్చింది. కాకపోతే ఇందులో క్లైమాక్స్‌ సీన్‌ మాత్రమే బాగుందని కొందరు అంటున్నారు. ఖుషి సినిమా చూసిన వారికి ఊహించని సీన్‌ ఒకటి కనిపిస్తుంది. అదే విజయ్‌ దేవరకొండ- సమంత మధ్య లిప్‌ లాక్‌(Lip Kiss) సీన్‌. ఇప్పుడు దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. సమంత సీనియర్‌ నటి కాబట్టి పెద్దగా రొమాంటిక్‌ సన్నివేశాలు ఉండకపోవచ్చని సినిమాకు వెళ్లిన వారికి మాత్రం ఈ ముద్దు దృశ్యం షాక్‌నిచ్చింది.

ఇది అవసరమా అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇదే ప్రశ్నను దర్శకుడు శివ నిర్వాణను కూడా అడిగారు. అందుకు దర్శకుడు తాను హీరోయిన్‌ సమంతను చూడలేదని, ఖుషి సినిమాలో ఆరాధ్యను మాత్రమే చూశానని హుందాగా జవాబిచ్చాడు. సినిమాలో రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణలో ప్రేమ, ఎమోషన్‌ను చెప్పడానికి లిప్ లాక్ సీన్ అవసరమేనని ఆయన సమర్థించుకున్నాడు. 'సినిమాలో హీరో హీరోయిన్లు ఒక ఏడాది పాటు కలిసి ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇందులో పిల్లల కోసం అని ఒక ఎమోషన్ పెట్టాం. అలాంటప్పుడు ముద్దు అనే ఒక చిన్న ముచ్చట కూడా లేకపోతే బాగోదు కదా' అని శివ నిర్వాణ అన్నాడు. 'సినిమా చూస్తున్నంత సేపు కొంచెం నేచురల్‌గా చూపించాలి కదా. చూసే ప్రేక్షకులు కూడా నమ్మాలికదా. వారిద్దరూ నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి కదా. అందుకే ఆ సీన్‌ పెట్టాము' అని చెప్పుకొచ్చారు. విజయ్, సమంతతో ఆ ముద్దు సీన్స్‌ ఎలా చేయించారని మరో మహిళా జర్నలిస్ట్ అడిగారు. 'ఇందులో ఇబ్బంది ఏముంది..? యాక్షన్ అంటే చేసేశారు.. కట్ అంటే అయిపోయింది.' అని జవాబిచ్చారు. ఇచ్చారు డైరెక్టర్‌ శివ నిర్వాణ.

Updated On 2 Sep 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story