హీరోయిన్ త్రిష(Trisha) పై అనిచిత వ్యాక్యలు చేసిన మన్సూర్(Mansoor) పై తమిళ నటి, జాతీయ మహిళాకమీషన్(National Women commission) సభ్యురాలు, బీజేపీ(BJP) నేత ఖుష్బు(Kushbu) మండి పడ్డారు. త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కాని దర్శకుడు ఆ సీన్ రాయలేదు అందుకే మిస్సయ్యానంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్ కనీసం క్షమాపణలు కూడా చెప్పేందుకు నిరాకరిస్తున్నాడు. తిరిగి త్రిషపైనే పరువు నష్టం దావా వేస్తానంటున్నాడు మన్సూర్ అలీ ఖాన్‌. ఈ విషయాన్ని పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుందని సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని తీరును ఖండించారు.

ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులు.. పక్కవాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపించి తాము చేసినదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. మన్సూర్ అలీ ఖాన్(Mansoor ali Khan).. ఎదుటివాళ్లను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తోంది. క్షమించండి...ఈ వివాదం నుంచి మీరు బయటపడలేరు. క్షమాపణలు చెప్పడంతో మీరేమీ తగ్గిపోరు. కానీ, మీ ఇంట్లో ఉండే మహిళలకు గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది అన్నారు.

మన్సూర్ ఎక్కువగా విలన్ పాత్రల్లో నటిస్తుంటారు. ఈ విషయంలో కూడా పంచ్ వేశారు ఖుష్బు. సినిమాల్లో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మీరు ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది అని ఖుష్బూ ట్వీట్ చేశారు. త్రిషకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుంది. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నితిన్, రోజా లాంటి వారు ఇప్పటికే స్పందించారు.

ఇక అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే.. త్రిష, విజయ్(Vijay) జంటగా నటించిన లియో(Leo) మూవీ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీలో మన్సూర్ అలీ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గతంలో ఎన్నో రేప్ సీన్స్‌లో నటించా. లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ అది లేకపోవడం నన్ను బాధించింది’’ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, త్రిషకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా మన్సూర్ మాత్రం ససేమిరా అంటున్నారు.

Updated On 24 Nov 2023 8:09 AM GMT
Ehatv

Ehatv

Next Story