సినిమా పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగడం అన్నది చాలా అరుదు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగించడం అన్నది అంత చిన్న విషయమేమీ కాదు. ఆ ఘనత కొద్ది మందికే దక్కుతుంది. అందులో చెన్నై చంద్రం త్రిష(Trisha) మొదటి ప్లేస్‌లో ఉంటారు. వర్షం సినిమాలో ఎంత అందంగా కనిపించిందో, మొన్నటి పొన్నియన్‌ సెల్వన్‌ కూడా అంతే అందంగా కనిపించారు త్రిష.

సినిమా పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా కొనసాగడం అన్నది చాలా అరుదు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ కొనసాగించడం అన్నది అంత చిన్న విషయమేమీ కాదు. ఆ ఘనత కొద్ది మందికే దక్కుతుంది. అందులో చెన్నై చంద్రం త్రిష(Trisha) మొదటి ప్లేస్‌లో ఉంటారు. వర్షం సినిమాలో ఎంత అందంగా కనిపించిందో, మొన్నటి పొన్నియన్‌ సెల్వన్‌ కూడా అంతే అందంగా కనిపించారు త్రిష. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. రెండు దశాబ్దాలకుపైగా సినిమా ప్రేమికులను అలరిస్తున్నారు. త్రిష ప్రయాణంపై నటి ఖుష్ఫూ సుందర్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఓ చిట్‌చాట్‌లో ఖుష్బూ(Khushboo Sundar) మాట్లాడుతూ త్రిషను ఎంతగానో ప్రశంసించారు. 'నటీమణులు 20 ఏళ్లుగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ త్రిష రెండు దశాబ్దాలకు పైగా లీడింగ్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ నంబర్‌వన్‌ నటిగా నిలబడింది. త్రిష మేల్‌ సూపర్‌స్టార్‌లాగా క్రౌడ్‌ పుల్లర్' అని ఖుష్బూ అన్నారు. ఒకప్పటి అందాల తార ఖుష్బూ ఇలా త్రిషపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. రీసెంట్‌గా మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ పొన్నియన్‌ సెల్వన్‌-2తో మంచి సక్సెస్ అందుకున్నారు త్రిష. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం విజయ్‌తో కలిసి లియోలో నటిస్తున్నారు. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తో జోడిగా నటిస్తున్నారు.

తమిళంలో ది రోడ్‌, సథురంగ వెట్టై 2 సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా లోకనాయకుడు కమల్ హాసన్‌- మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్నకమలహాసన్‌ 234 లో త్రిష ఫైనల్ అయినట్టు సమాచారం. అజిత్‌కుమార్‌, మగిజ్ తిరుమేని కాంబినేషన్‌లో వస్తున్న విదాముయార్చిలో కూడా త్రిష పేరునే పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Updated On 5 Aug 2023 10:51 PM GMT
Ehatv

Ehatv

Next Story