త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న సినిమా 'గుంటూరు కారం'(Guntur Karam). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కుర్చీని మడతపెట్టి అనే ఊర మాస్ సాంగ్(song) ను రిలీజ్ చేశారు.

Kurchi Thatha
త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న సినిమా 'గుంటూరు కారం'(Guntur Karam). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కుర్చీని మడతపెట్టి అనే ఊర మాస్ సాంగ్(song) ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో మహేష్, శ్రీలీల(sreeleela) మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. ఈ కుర్చీ మడత అనే పదం సోషల్ మీడియాలో(social media) ఒక తాత కారణంగా వైరల్ అయింది. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వాడేస్తున్నారు.
అయితే.. తన డైలాగ్ ను మహేష్ బాబు సినిమాలో పాటగా వాడటంపై కుర్చీ తాత(Kurchi thatha) స్పందించారు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో నా డైలాగ్ ను పాటగా చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అవకాశం ఇస్తే నాకు ఆ పాటలో డ్యాన్స్ చేయాలని ఉందని.. ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. నా డైలాగ్ ను వాడడంపై.. సంగీత దర్శకుడు తమన్ నన్ను పిలిచి నా డైలాగ్ వాడుతున్నామని చెప్పడమే కాక.. ఆర్థిక సాయం కూడా అందించారన్నారని కుర్చీ తాత తెలిపారు.
ఇదిలావుంటే.. ఈ పాటను మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 30న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
