మ్యూజిక్ స్కూల్'(Music school).. శ్రియ శరణ్(Shriya Saran), శర్మన్ జోషీ(sharman joshi), ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రల్లో నటించారు. పాపారావు బియ్యాల(Papa Rao Biyala) స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం మే 12, 2023న విడుదల కానుంది. సినిమా ఆడియో, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మే 6, 2023న హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో నిర్వహించారు.
'మ్యూజిక్ స్కూల్'(Music school).. శ్రియ శరణ్(Shriya Saran), శర్మన్ జోషీ(sharman joshi), ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రల్లో నటించారు. పాపారావు బియ్యాల(Papa Rao Biyala) స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం మే 12, 2023న విడుదల కానుంది. సినిమా ఆడియో, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మే 6, 2023న హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యామిని ఫిల్మ్స్, వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. పాపారావు గారు కొన్ని సంవత్సరాల నుండి తనకు తెలుసునని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన ఒక బ్యూరోక్రాట్ గా తనకు బాగా తెలుసు అని అన్నారు. తమకు ఢిల్లీలో పరిచయాల కోసం ఆయన ఎంతగానో సహాయం చేశారని చెప్పుకొచ్చారు కేటీఆర్.
తెలంగాణ ఏర్పడడానికి ఆయన వెనుకనే ఉండి ఎంతో సహాయం చేశారని కేటీఆర్ కొనియాడారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక.. ప్రభుత్వానికి సలహాదారుగా కూడా వ్యవహరించారని కేటీఆర్ అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ఇద్దరు కారణం.. ఒకరు పాపారావు.. ఆయన సినిమా తీశాను అని చెప్పగానే ఆశ్చర్యపోయాను. సినిమా తీసే సమయంలో కూడా చెప్పలేదు. సినిమా తీసేశాక చెప్పడంతో నేను షాక్ అయ్యాను.
పాపారావు సినిమా చేస్తున్నారని నేను న్యూస్ లో చూసి తెలుసుకున్నానని, ఏది చేసినా బాగా చేయాలని ఆకాంక్షించానని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రోమోలు చూస్తుంటే సినిమా చాలా బాగా వచ్చిందని మనకు అర్థం అవుతోంది. ఇక రెండో వ్యక్తి ఇళయరాజా. సినిమా పేరు మ్యూజిక్ స్కూల్.. కానీ నా పక్కన ఉన్న వ్యక్తి ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ అని ఇళయరాజాను చూపించారు కేటీఆర్. మ్యూజిక్ యూనివర్సిటీ పక్కన నిలబడే అవకాశం నాకు దక్కడం ఎంతో అదృష్టంగా ఉందని కేటీఆర్ అన్నారు.
మన ఇళ్లల్లో పిల్లలకు మనం పిల్లలకు సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్.. ఇవి మాత్రమే చదవాలి.. అయితే ఇంజనీర్ అవ్వాలి.. లేదంటే డాక్టర్ అవ్వాలి అని చెబుతూ ఉంటాం. వాళ్ళల్లో ఉండే క్రియేటివిటీని చంపేస్తూ ఉంటాం.. ఇలాంటి అంశాలపై సినిమా తీశామని పాపారావు చెప్పారు.. ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. మన దేశంలో గొప్ప ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. గొప్ప గొప్ప కళాకారులు కూడా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
ఈ మధ్య నేను కూడా ఆశ్చర్యపోయిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. నా కొడుక్కి 17 సంవత్సరాలు.. మూడు నెలల కిందట ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఓ సాంగ్ పాడాను, రిలీజ్ చేస్తున్నా అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను అని చెప్పారు. నా బిడ్డకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు.. కానీ ఓ కవర్ సాంగ్ పాడాడు.. ఇలాంటి హిడెన్ ట్యాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేయకూడదు.. వాళ్ల మనసుకు ఏమనిపిస్తుందో అది చేయమని ఎంకరేజ్ చేయాలని అన్నారు కేటీఆర్. ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ కోరారు.
మీరు అందుకు ఒప్పుకుంటారని ఆశిస్తున్నానని కేటీఆర్ అన్నారు.తెలంగాణలో మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటుకు నేను ఒప్పుకుంటున్నానని ఇళయరాజా చెప్పుకొచ్చారు. కేటీఆర్ ప్రజలకు ఎంతో చేస్తున్నారని.. ప్రజలు వచ్చి రాజును ఏం కావాలో అడిగేవారు.. మంత్రి వచ్చి ప్రజలను అడిగితే వద్దంటారా అని అన్నారు ఇళయరాజా. నేను ప్రజల్లో ఒక్కడిని.. మ్యూజిక్ నేర్చుకున్న ప్రాంతంలో వైలెన్స్ ఉండదు.. ప్రేమ ఎక్కువగా ఉంటుందని అన్నారు. మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటైతే నాలాంటి చాలా మంది తయారవుతారని ఇళయరాజా చెప్పుకొచ్చారు.